Begin typing your search above and press return to search.
చెర్రీ నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ ఎవరు ?
By: Tupaki Desk | 20 Oct 2015 7:00 PM ISTబ్రూస్ లీ రిలీజ్ వరకూ అయితే.. ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యేది కాదు. చరణ్ సెలక్షన్ విషయంలోనూ, కాస్టింగ్ విషయంలోనూ, టెక్నికల్ టీం ఎంపికలోనూ చరణ్ దే ఫైనల్ డెసిషన్. చిరు సహా మిగతా మెగా ఫ్యామిలీ అంతా తగిన సూచనలు చేసేవారంతా. కానీ బ్రూస్ లీ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిజానికి చరణ్ తర్వాతి మూవీ తని ఒరువన్ రీమేక్ అని, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఇది రూపొందుతుందని.. ఈ మూవీలో విలన్ గా అరవింద్ స్వామి చేస్తుండగా.. హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేశారనే వార్తలొస్తున్నాయి. కానీ ఇవేవీ ఫైనల్ కాలేదు.
మాస్ జోనర్ తోపాటు ఫ్యామిలీస్ ని ఆకట్టుకునేందుకు చేసిన రెండు ఎటెంప్ట్స్ ఫెయిల్ అవడంతో.. ఈసారి పక్కా మాస్ మసాలా తీయాలని అనుకుంటున్నాడట చరణ్. ఇందుకోసం మాస్ లో మాంచి కమాండ్ ఉన్న పూరి జగన్నాధ్ ని డైరెక్టర్ తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. పూరి దగ్గర చరణ్ కి సరిపడే మాంచి లైన్ ఉండడం, పూరి-చెర్రీల మధ్య మంచి ర్యాపో ఉండడంతో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని తెలుస్తోంది. అయితే.. కత్తి - తని ఒరువన్ రీమేక్ లను పక్కన పెట్టి, వివి వినాయక్ తో చెర్రీ మూవీ తీయాలని అనుకుంటోంది మెగా ఫ్యామిలీ. ఈ మేరకు ఇప్పటికే కొన్ని లీక్స్ కూడా అందాయి.
అదే సయమంలో తనకు రచ్చ లాంటి హిట్ ఇచ్చిన సంపత్ నందికి ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నాడు రామ్ చరణ్. అయితే.. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి కావాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ నిర్మాతగా చెర్రీ హీరోగా తీయబోతున్న చిత్రానికి సంబంధించినదే ఈ కాంబినేషన్. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం చరణ్ సినిమా డైరెక్షన్ బాధ్యతలు హరీష్ శంకర్ కి అప్పగించాలని అనుకుంటున్నాడట. మొత్తానికి మంచి నేమ్, ఫేమ్ ఉన్న ఐదారుగురు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతమందిలో చెర్రీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో. ?