Begin typing your search above and press return to search.

వైజాగ్‌ లో మెగాస్టూడియో ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   23 Aug 2018 5:28 PM GMT
వైజాగ్‌ లో మెగాస్టూడియో ఎక్క‌డ‌?
X
వైజాగ్ టాలీవుడ్ గురించి ప్ర‌స్తుతం ఏపీ పొలిటిక‌ల్ కారిడార్ సహా హైద‌రాబాద్ ఇండ‌స్ట్రీలో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఏపీ టీవీ - చ‌ల‌న‌చిత్ర రంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌ డీసీ) త‌ర‌పున అంబికా కృష్ణ స్వ‌యంగా భ‌విష్య‌త్ డెవ‌ల‌ప్‌ మెంట్స్‌ పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డంతో స‌ర్వ‌త్రా ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే అంబిక ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌ముఖంగా నంద‌మూరి బాల‌కృష్ణ పేరు - ప్ర‌ఖ్యాత మ‌ద్రాసు- ఏవీఎం స్టూడియోస్ పేర్లు వినిపించ‌డంతో అంద‌రిలో క్యూరియాసిటీ రెయిజ్ అయ్యింది. బాల‌కృష్ణ వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ప‌క్క‌నే వేరొక భారీ స్టూడియో నిర్మించేందుకు ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నార‌ని గ‌త ఏడాది కాలంగా వార్త‌లొస్తూనే ఉన్నాయి. ఈ విష‌యంపై ప్ర‌స్తుతం అటు మెగా కాంపౌండ్ - అల్లు కాంపౌండ్ - కింగ్ నాగార్జున అన్నపూర్ణ కాంపౌండ్‌ లోనూ ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింద‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి ఏపీ - తెలంగాణ డివైడ్ త‌ర్వాత టాలీవుడ్‌ ని వైజాగ్ లో ఏర్పాటు చేయాల‌ని సినీపెద్ద‌లు నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌ట్లోనే ఫిలింఛాంబ‌ర్‌ లో జ‌రిగిన ఓ స‌మావేశంలో విశాఖ‌లో టాలీవుడ్ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ప్ర‌స్థావిస్తూ.. రెండు రాష్ట్రాల్లో సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందాల‌ని కోరారు. అప్ప‌టికి కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటుపై ఆయ‌న‌కు ఓ క్లారిటీ ఉంది. అయితే ఊహించ‌ని డివైడ్‌ తో కొత్త‌ రాజ‌ధాని సెట‌ప్ పూర్త‌వ్వ‌క‌పోవ‌డంతో ఏపీ ప్ర‌భుత్వానికి స‌రైన క్లారిటీ మిస్స‌యింది. అయితే ఇటీవ‌ల కాస్తంత వెసులుబాటు రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా పూనుకుని స్టూడియోల ఏర్పాటుపై సీరియ‌స్‌ గానే డెసిష‌న్ తీసుకున్నార‌ని చెప్పుకుంటున్నారు.

ఇక‌పోతే న‌ట‌సింహా బాల‌కృష్ణ సొంతంగా స్టూడియో నిర్మిస్తే - అది ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాల‌కు స్ఫూర్తినిస్తుంద‌ని - వాళ్ల‌లోనూ అందుకు ప్రేర‌ణ క‌లుగుతుంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర‌వింద్ బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో భారీ స్టూడియో ప్లాన్ చేశార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. నా చివ‌రి జీవితాన్ని ప్ర‌శాంత విశాఖ‌లోనే గ‌డుపుతాన‌ని మెగాస్టార్ అప్ప‌ట్లో బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. దీనిని బ‌ట్టి ఇక‌పై వైజాగ్‌ పై మెగా కాంపౌండ్ సీరియ‌స్‌ గానే ఆలోచిస్తుంద‌ని అనుకున్నారంతా. మెగాస్టార్ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తో క‌లిసి వైజాగ్ టాలీవుడ్‌ పై సీరియ‌స్‌ గానే ప్లాన్ చేశార‌ని మాట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత 2018 మిడ్‌ లో రామ్‌ చ‌ర‌ణ్- ప్ర‌భాస్‌ తో క‌లిసి స్టూడియోల నిర్మాణం బిజినెస్ చేస్తార‌ని ప్ర‌చార‌మైంది. ప్ర‌స్తుతం విశాఖ‌న‌గ‌రంలో మెగా స్టూడియో గురించి స్థానిక మెగాఫ్యాన్స్‌ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బాల‌య్య స్టూడియో నిర్మిస్తే - ఆ ప‌క్క‌నే మెగాస్టూడియో కూడా ఉండాలి క‌దా? అన్న ప్ర‌శ్న విశాఖ‌- మెగాభిమానుల్లో క‌లిగిందిట‌. ఇక‌పోతే ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కి వైజాగ్ జ‌గ‌దాంబ ఏరియాలో వంద‌ల గ‌జాల స్థ‌లం ఉంద‌న్న స‌మాచారం ఉంది. మ‌రోవైపు కింగ్ నాగార్జున వైజాగ్‌ లో స్టూడియో ఏర్పాటు చేసే ఆలోచ‌న చేశార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. మొత్తానికి బాల‌య్య స్టూడియో నిర్మిస్తే ఇంత‌మందిలో వేడి పెంచ‌నుంద‌ని సీన్ చెబుతోంది. మ‌రి వీళ్ల మైండ్‌ లో అస‌లేం ప్లాన్ ఉందో? ఎవ‌రి మైండ్‌ లో ఏ గేమ్ ప్లాన్ ఉందో వాళ్లే చెబితే అభిమానుల‌కు ఓ క్లారిటీ ఉంటుంది.