Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఐదుగురు టాలీవుడ్ స్టార్లు ఒకే చోట!
By: Tupaki Desk | 4 Jan 2019 10:11 PM ISTటాలీవుడ్ లో చాలామందే స్టార్లున్నారు. మిగతా ఫిలిం ఇండస్ట్రీలలో జస్ట్ స్టార్లు ఉంటారేమోగానే టాలీవుడ్ లో ప్రతి ఒక్క స్టార్ కు ఒక్కో బిరుదు ఉంది ఒక్క విజయ్ దేవరకొండ కు తప్ప. మరి ఇలాంటి స్టార్లను ఒకే ఫ్రేమ్ లో చూడడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సందర్భమే రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం రూపంలో వచ్చింది.
జైపూర్లో అంగరంగ వైభవంగా జరిగిన కార్తికేయ - పూజ ప్రసాద్ ల వివాహానికి చాలామంది టాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. ఈ వేడుకలో మన తెలుగు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కలిసి పోజిచ్చారు. ప్రభాస్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. రానా దగ్గుబాటి.. నాని లు కలిసి ఫోటోకు పోజివ్వడం గొప్పవిషయమే కదా. వీరితో ఈ ఫోటోలో మనకు తెలియని వ్యక్తి మాత్రం ఒకరున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
అంటే అందరికీ కోపం వస్తుంది గానీ ఐదు మంది హీరోలు ఒకే చోట చేరి ఫ్రెండ్స్ లా కలిసి మెలిసి ఎంజాయ్ చేసి ఫోటోలకు పోజులు కూడా ఇస్తుంటే ఫ్యాన్స్ మాత్రం రికార్డ్స్ అని.. అదని..ఇదని ఫైట్లు చేసుకుంటే ఎలా.. వాళ్ళు కూడా ఎంచక్కా ఇలా కలిసిమెలిసి ఫ్రెండ్స్ లా ఉంటే బాగుంటుంది కదా!
