Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ కు రెండు నెలలు బ్రేక్ కావెలెను

By:  Tupaki Desk   |   19 April 2021 4:35 AM GMT
రామ్ చరణ్ కు రెండు నెలలు బ్రేక్ కావెలెను
X
ఏ వృత్తిలో అయినా ప్రెజర్ తో ఎక్కువ కాలం పనిచేయలేదు. అలాగే కంటిన్యూ వర్క్ షెడ్యూల్స్ కూడా విసుగెత్తిస్తాయి. రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఒత్తిడి బాగా ఉంటుంది. ఆ ఒత్తిడి వెళ్లి తాము చేస్తున్న ప్రాజెక్టులపై పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కమిటైన ప్రాజెక్టులు రకరకాల కారణాలతో లేటైతే అనుకున్న గ్యాప్ దొరకదు. రిలాక్సేషన్ ఉండదు. ఇప్పుడు రామ్ చరణ్ పరిస్దితి అలాగే ఉంది. ఓ ప్రక్కన రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ కంటిన్యూ షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆచార్యలో చేస్తున్నారు.

ఈ రెంటికి మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటే కరోనా వచ్చి ఆ ప్లానింగ్ పాడు చేసింది. దాంతో ఇప్పుడు చరణ్ మినిమం రెండు నెలలు గ్యాప్ తీసుకుని పూర్తిగా రిలాక్స్ అయ్యాకే తర్వాత ప్రాజెక్టులోకి దూకుదామని చెప్తున్నారట. శంకర్ తో కమిటైన సినిమా ఆగస్ట్ నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు. ఈలోగా కరోనా లేని దేశానికి భార్య ఉపాసనతో వెళ్లి గడపాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని శంకర్ కు చెప్పి షెడ్యూల్ ప్లాన్ చేసుకోమన్నారట.

తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను రూపొందించిన శంకర్ ఇప్పటివరకు ఒక్క తెలుగు హీరోతో కూడా మూవీ తీయలేదు. దాంతో శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‏తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.

అయితే శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ప్లాన్ చేసిన భారతీయుడు 2 సినిమా చేయాలా వద్దా అనే డైలమోలో ఉన్నాడు. ఈ మూవీ విషయం తేలిన తర్వాత చరణ్, శంకర్ కాంబో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‏ అనిరుధ్ రవిచంద్రన్‏ను సెలక్ట్ చేయనున్నట్లు సమాచారం. మిగతా టెక్నీషియన్స్ కూడా ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నవాళ్లనే శంకర్ ఎప్పటిలాగే ఎంచుకుంటున్నారు.