Begin typing your search above and press return to search.

చెర్రీ 'డేరింగ్ స్టార్' అనేశాడు..

By:  Tupaki Desk   |   3 Sept 2017 12:00 PM IST
చెర్రీ డేరింగ్ స్టార్ అనేశాడు..
X
సినిమా ఫీల్డ్ లో హీరో హీరోయిన్లకన్నా బిజీగా ఉండేది క్యారెక్టర్ ఆర్టిస్టులనే చెప్పాలి. స్క్రీన్ పై కనిపించేది కొద్దీ సేపైనా వారు చేసే పాత్రలు జనాల్లో ఎదో ఒక విధంగా హైప్ క్రియేట్ చేస్తాయి. ఇక ఒకప్పటి కథానాయకులు ఇప్పుడు స్పెషల్ రోల్స్ లో చేస్తూ అలరిస్తున్నారు. అలాగే విలన్స్ గాను విజిల్స్ వెయిస్తున్నారు.

ఇప్పుడు ఒకప్పటి ఫ్యామిలీ హీరోగా పెరు తెచ్చుకున్న జగపతిబాబు కూడా స్పెషల్ రోల్స్, విలన్ రోల్స్ అని అన్ని తరహా పాత్రలను చేస్తూ మెప్పిస్తున్నాడు. మెగాస్టార్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "సైరా" లో ఒక మెయిన్ రోల్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే చిరు తనయుడు చరణ్ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ లో అలరించనున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రంగస్థలం1985" సినిమాలో ఓ ముఖ్య పాత్రకు చెర్రినే జగ్గూభాయ్ ని సెలెక్ట్ చేశారు. ఇక రీసెంట్ గా చిరు బర్త్ డే వేడుకల్లో కూడా జగపతిబాబు గారు అన్ని తరహా పాత్రలను చేయగలరని అందుకే ఆయనను "డేరింగ్ స్టార్" అని సంభోదించాడట రామ్ చరణ్. ఇక జగ్గూభాయ్ మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లోను బిజీగా ఉన్నాడు.

మొత్తానికి జగపతి బాబు నిజంగానే డేరింగ్ స్టారే లే. ఎందుకంటే ఒక హీరోగా అన్నేళ్ళు కొనసాగి.. చాలామంది ఇక హీరో ఛాన్సులు రావట్లేదని రిటైర్ అవ్వడమో లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో కూడా చేశారు. కాని జగపతి బాబు మాత్రం టైమ్ అయిపోయిందని తెలుసుకుని చక్కగా విలనీ వైపు తిరిగేశాడు. వెల్ డన్ డేరింగ్ స్టార్.