Begin typing your search above and press return to search.

జెర్సీ దర్శకుడితో మెగాహీరో మూవీ చేయనున్నాడా..??

By:  Tupaki Desk   |   30 Dec 2020 10:32 AM GMT
జెర్సీ దర్శకుడితో మెగాహీరో మూవీ చేయనున్నాడా..??
X
మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2021 ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు ఆర్ఆర్ఆర్ మూవీకి మరో మూడు నెలల టైం పడుతుందని అంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా హీరో రాంచరణ్ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనేది ఆసక్తిగా ప్రశ్న. ఇప్పటిదాకా పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా.. ఇప్పటికే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో ప్లాన్ చేసాడు. మరి ఇప్పుడు రాంచరణ్ సంగతి ఏంటని చర్చ. ఇదిలా ఉండగా ఆ మధ్యలో జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాంచరణ్ సినిమా చేయబోతునట్లు టాక్ వినిపించింది. అయితే అందులో వాస్తవం లేదని చెప్పేసరికి ఆ న్యూస్ కనుమరుగయింది.

ఈ టైంలో రాంచరణ్ నెక్స్ట్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ బడా నిర్మాత.. టాలీవుడ్ హిట్ మూవీ డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చి రాంచరణ్ కోసం మంచి కథని సిద్ధం చేయించినట్లు తెలుస్తుంది. ఆ కథ పై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతుండగా.. చరణ్ నెక్స్ట్ మూవీలో పోలీస్ అధికారి పాత్ర చేయనున్నాడని టాక్. అయితే గౌతమ్ తీయబోయే సినిమా ఇదేనా కాదా అనే సినీవర్గాలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా కమర్షియల్ జోనర్ లో ఉంటూనే హెవీ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఉండబోతుందని సమాచారం. అయితే బయటికి రాకపోయినా లోపల లోపల గౌతమ్, చరణ్ ల మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయట. మరి అదే గనక నిజమైతే మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అసలు విషయాలు తెలుకోవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!