Begin typing your search above and press return to search.

ఐటీ వాళ్లూ వింటుంటారని గుర్తుందా చెర్రీ?

By:  Tupaki Desk   |   14 Jan 2017 5:40 AM GMT
ఐటీ వాళ్లూ వింటుంటారని గుర్తుందా చెర్రీ?
X
చిన్న వయసులోనే..తన మొదటి సినిమాను చిరంజీవి లాంటి మెగాస్టార్ తో అది కూడా.. ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి 150వ సినిమాను ప్రొడ్యూస్ చేయటం చెర్రీకి మాత్రమే సాధ్యమవుతుందేమో. చిరు కొడుకు ట్యాగ్ లేకుండా..ఎన్ని వందల కోట్లు ఉంటే మాత్రం మెగాస్టార్ ముందుకెళ్లి.. ఆయన సినిమాను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా? అయినప్పటికీ.. చెర్రీని ఆకాశానికి ఎత్తేస్తూ.. ప్రొడ్యూసర్ గా అతన్ని ఎత్తేస్తున్న తీరు ఇండస్ట్రీలో కాస్తంత చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. బాస్ సినిమా బాక్స్ ఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము రేపుతుండటంతో రికార్డులు ఒకటి తర్వాత మరొకటి బద్ధలైపోతున్నాయి. ఖైదీ నంబరు 150 తొలి రోజు కలెక్షన్ల గురించి వస్తున్న వార్తలు మెగా అభిమానుల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖైదీ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.

అదేమిటంటే.. చిరు రెమ్యూనరేషన్ మినహాయిస్తే.. ఈ సినిమాకు పెట్టి ఖర్చు దాదాపు రూ.30 కోట్లు అని.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజునే రూ.47 కోట్ల షేర్ వచ్చేసిందని చెబుతున్నారు. దీంతో.. నిర్మాతగా చెర్రీ తన మొదటి సినిమాతోనే భారీ లాభాల్ని సాధించిన ప్రొడ్యూసర్ గా మారారు. ఒక భారీ సినిమాకు మొదటి రోజు కలెక్షన్లతోనే లాభాల బాట పడితే.. మొత్తం అకౌంట్ క్లోజ్ అయ్యేనాటికి మరెంత భారీగా సొమ్ములు వచ్చేస్తాయో? అన్నది ఒక ఆసక్తికరమైన ప్రశ్న అయితే..ఇంతేసి రికార్డు కలెక్షన్ల మాటను అభిమానులే కాదు.. ఐటీ శాఖ అధికారులు కూడా వింటూ ఉంటారన్న విషయాన్ని యంగ్ ప్రొడ్యూసర్ కు గుర్తుందా? అని పలువురు గుర్తు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/