Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ అదేనా..?

By:  Tupaki Desk   |   2 Sep 2021 2:30 AM GMT
రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ అదేనా..?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్.ఆర్.ఆర్' అనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్.. కొంత ప్యాచ్ వర్క్ మినహా పూర్తయ్యింది. దీంతో పాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. దీని తర్వాత ప్రాజెక్ట్ ని కూడా చరణ్ ఇప్పటికే ప్రకటించారు.

అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో రామ్‌ చరణ్‌ తన 15వ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ నాటికి కంప్లీట్ చేసే విధంగా శంకర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం పలువురు దర్శకులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెర్రీ తన 16వ చిత్రాన్ని లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ ఓ సినిమాకు కమిట్ అయ్యారట. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే అయినప్పటికీ.. రీసెంట్ గా హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. #RC16 ను ఎన్వీ ప్రసాద్ మరియు చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్. ఇటీవలే 'జెర్సీ' హిందీ రీమేక్ షూటింగ్ పూర్తి చేసిన గౌతమ్.. ప్రస్తుతం చరణ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. శంకర్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.