Begin typing your search above and press return to search.

చరణ్ గెట్ సెట్ గో

By:  Tupaki Desk   |   4 Jun 2019 10:23 AM IST
చరణ్ గెట్ సెట్ గో
X
చీలమండకు కలిగిన గాయం వల్ల సుమారు రెండు నెలలు రెస్ట్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సతీసమేతంగా ఆఫ్రికా అడవుల్లో సేదతీరుతున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే ఆ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి . ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతుండగా జిమ్ లో ప్రమాదానికి గురైన చెర్రీ ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్నాడు. ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్ తాలుకు పార్ట్ షూట్ చేస్తున్నారు కాబట్టి తన ప్రమేయం అవసరం లేకపోవడంతో చరణ్ హైదరాబాద్ షెడ్యూల్ కు దూరంగా ఉన్నాడు .

ఇప్పుడది పూర్తి కావొచ్చింది. వచ్చే వారం నుంచి డేట్స్ తీసుకోవచ్చని చరణ్ రాజమౌళికి చెప్పినట్టు సమాచారం. సో ఇక విస్త్రుతమైన ప్లానింగ్ లో జక్కన్న బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే చాలా విలువైన సమయం కరిగిపోయింది. డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేయడం సాధ్యపడేలా లేదు. అందుకే ఇంకో నెల అదనంగా పట్టినా డే అండ్ నైట్ వర్క్ చేసేలా తన టీంని రెడీ చేసేపనిలో జక్కన్న ఉన్నట్టు తెలిసింది

ఇప్పుడు రీ స్టార్ట్ కాబోయే అహ్మదాబాద్ షెడ్యూల్ లోనే అలియా భట్ జాయిన్ అవుతుంది. ఆలోగానే జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించబోయేది ఎవరో డిసైడ్ చేస్తారు. ఇంకో విదేశీ భామని ఒకసారి లేదు సాయి పల్లవితో చర్చలు జరుపుతున్నారని మరోసారి ఇలా రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి కాని పక్కగా ఇది న్యూస్ అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒకవైపు ఈ సస్పెన్స్ తారక్ ఫ్యాన్స్ ని బాగా టెన్షన్ పెడుతోంది.

సినిమా మొదలై నాలుగు నెలలు అవుతున్నా తమ హీరోకు జోడిని ఫిక్స్ చేయకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే నెలకొంది. అయితే వాళ్ళ కోసమే ఆలస్యం చేస్తున్న రాజమౌళి ఇంకో వారం లోపు ఎవరు అనేది ట్విట్టర్ ద్వారా ప్రకటించే అవకాశం ఉందట. మొత్తానికి చరణ్ రాకతో వేగం పెరగబోతోంది. పైన స్టిల్ కూడా ఆఫ్రికా సిరీస్ లో భాగంగా మెగా కపుల్ వదిలిందే. అల్లూరి సీతారామరాజుగా చరణ్ కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు