Begin typing your search above and press return to search.

2019 లో సాహ‌సాల హీరో గా చెర్రీ రికార్డ్!

By:  Tupaki Desk   |   24 Dec 2019 6:02 AM GMT
2019 లో సాహ‌సాల హీరో గా చెర్రీ రికార్డ్!
X
త‌ల‌లు న‌రికి గాల్లో బంతాట అడితే దానిని ఎమోష‌న్ అంటారా? గాల్లోకి లేచిన త‌ల ఎటెళ్లిందో కూడా ఎవ‌రికీ తెలీదు. అయ్యో..! ఇలాంటి కామెడీలు రామ్ చ‌ర‌ణ్ చేస్తారా? మెగా హీరోల జ‌డ్జిమెంట్ ఇదేనా? ఎంత బోయ‌పాటి అయితే మాత్రం ఇలాంటి సాహ‌సం చేస్తారా? అంటూ ఒక‌టే ట్రోలింగ్స్ తో సామాజిక మాధ్య‌మాల్లో దుమ్మెత్తి పోసారు. 2019 సంక్రాంతికి రిలీజైన `విన‌య విధేయ రామ‌` ఆ లెవ‌ల్లో బుద్ధి చెప్పింది. ఇక ఎప్ప‌టికీ అలాంటి దుస్సాహ‌సం చ‌ర‌ణ్ చెయ్య‌నే చెయ్య‌రు! అంటూ మెగాభిమానులే మాట్లాడుకున్నారు.

కార‌ణం ఏదైనా 2019 ది బెస్ట్ ట్రోల్డ్ హీరోల జాజితా లో చ‌ర‌ణ్ చేరి పోయారు. ఈ ఏడాది `విన‌య విధేయ రామ` ఆ లెవ‌ల్లో డిజాస్ట‌ర్ అవ్వ‌డానికి లాజిక్ మిస్స‌వ్వ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. ఆ సినిమా చ‌ర‌ణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. క‌థ‌ను జ‌డ్జి చేసింది చ‌ర‌ణ్ కాబ‌ట్టి ఈ ట్రోలింగ్ భ‌రించ‌క త‌ప్ప‌లేదు. కార‌ణం ఏదైనా ఆయ‌న నిరంత‌రం వార్త‌ల్లోకొచ్చారు. మ‌రో వైపు డాడ్ కి నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే గిఫ్ట్ ఇచ్చేందుకు చ‌ర‌ణ్ చేసిన సాహ‌సం అంతే ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. దాదాపు 250 కోట్లు పైగా బ‌డ్జెట్ ని వెచ్చించి సైరా-న‌ర‌సింహారెడ్డి లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మించారంటే దానికి ఎంత రిస్క్ చేశార‌న్న‌ది అంచ‌నా వేయ‌గ‌లం. ఇక ఈ సినిమా వ‌ల్ల కూడా చ‌ర‌ణ్ ది బెస్ట్ సెర్చ్ డ్ హీరో గా గూగుల్ లో రిజిస్ట‌ర్ అయ్యారు. హీరోగా నిర్మాత‌గా చ‌ర‌ణ్ గురించి 2019లో ఎక్కువ‌ గా మాట్లాడుకున్నారు యూత్.

ఇక దీంతో పాటు.. ద‌ర్శ‌కధీరుడు తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో న‌టిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ చిత్రంలో విశాఖ‌ మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌డంతో ఆరాలు ఎక్కువ‌య్యాయి. ఇక ఇందులో చ‌ర‌ణ్ గెట‌ప్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి వార్త కోసం జ‌నం ఎక్కువ‌గా వెతికారు. చ‌ర‌ణ్ పేరును ప్ర‌స్థావించారు. అలా 2019 టాప్ ట్రెండింగ్ హీరో అయ్యారు చ‌ర‌ణ్. తిట్లు తిన‌డంలో.. అలాగే సాహ‌సాలు చేయ‌డంలో చ‌ర‌ణ్ ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యాడు మ‌రి.

2020 హంగామా RRR సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్‌ లో నటిస్తున్నాడు. చిత్రంలో రామ్ చరణ్- ఆలియాలపై షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను 2020 జులై నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు జక్కన్న.