Begin typing your search above and press return to search.

RRR సెట్లోకి మళ్లీ అల్లూరి..?

By:  Tupaki Desk   |   23 Dec 2020 2:30 PM GMT
RRR సెట్లోకి మళ్లీ అల్లూరి..?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. RRR టైటిల్ తో ఫేమస్ అయిన ఈ చిత్రంలో హీరోలిద్దరూ పవర్ ఫుల్ పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు ఫ్యాన్స్ ను తెగ ఖుషీ చేశాయి. ‘రామరాజు కోసం భీం’ అంటూ వచ్చిన తొలి టీజర్ తో అభిమానుల గూస్ బంస్ కాగా.. ‘భీం కోసం రామరాజు’ అంటూ విడుదలైన రెండో టీజర్ దుమ్ములేపింది. ఈ టీజర్లు యూట్యూబ్ లో కొత్త రికార్డలు క్రియేట్ చేశాయి.

కాగా.. కొంతకాలంగా నిర్విరామంగా షూట్ చేస్తున్న జక్కన.. ఇటీవల చిన్న బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి గడ్డం లుక్ లోకి మారిపోయి తన రామ్ చరణ్.. సోదరి నిహారిక వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా లుక్ మార్చేశాడు చెర్రీ.

మళ్ళీ క్లీన్ షేవ్ తో.. టీజర్లోని అదే మీసం కట్టుతో కనిపిస్తున్నాడు ఈ మెగాపవర్ స్టార్. చాలా కాలం గ్యాప్ అనంతరం చరణ్ మళ్ళీ ఈ లుక్ లోకి మారడంతో ఈ పవర్ ఫుల్ ఇమేజెస్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీంతో.. చర్రె మళ్లీ RRR కోసం రెడీ అయ్యాడనే డిస్కషన్ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. రాజమౌళి ఆస్థాన విద్వాంసుడు ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది దసరాకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.