Begin typing your search above and press return to search.

చరణ్ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ!

By:  Tupaki Desk   |   7 March 2019 10:20 PM IST
చరణ్ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ప్రేక్షకులకు ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. హోస్ట్ అవతారమెత్తి ఇంటర్వ్యూలు చేస్తాడని.. ఆ ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్ కోసమని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ఇంటర్వ్యూలు అనగానే 'ఫ్రాంక్లీ విత్ టీఎన్నార్' స్టైల్ అని మీరు ఫిక్స్ అయిపోకండి. ఇంటర్వ్యూలే కానీ టీఎన్నార్ స్పేస్ ను కదిలించి.. ఆయన స్థానాన్ని కబళించే ప్రయత్నం మాత్రం కాదు.

నిర్మాతగా చరణ్ నాన్నగారు చిరంజీవితో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'సైరా' అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భారీస్థాయిలో ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టాలని చూస్తున్నాడట. ఇందులో భాగంగా 'సైరా' టీమ్ చరణ్ కు ఈ సినిమాకు పనిచేసే సీనియర్ నటులను.. స్టార్ టెక్నిషియన్లను చరణ్ స్వయంగా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందనే ఐడియా ఇచ్చారట. ఈ ఐడియా చరణ్ కు విపరీతంగా నచ్చడంతో వెంటనే సరే అన్నాడట.

ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూ ప్రమోషన్స్ లో భాగంగా మొదటి ఇంటర్వ్యూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను చేస్తారట. 'సైరా' లో అమితాబ్ నటించాల్సిన సీన్స్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయట. ఆ సన్నివేశాలను ఈ నెలాఖరున చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారట. అప్పుడే చరణ్ బచ్చన్ సాబ్ ను ఇంటర్వ్యూ చేస్తాడట. ఆ తర్వాత వరసపెట్టి మిగతా టాలెంటెడ్ ఆర్టిస్టులు.. టెక్నిషియన్ల వైపు కొణిదెల రాముడు దృష్టి సారిస్తాడట.