Begin typing your search above and press return to search.

చరణ్‌-ఎన్టీఆర్.. వాటే ఎపిక్ కౌగిళింత!!

By:  Tupaki Desk   |   29 Sept 2017 9:15 PM IST
చరణ్‌-ఎన్టీఆర్.. వాటే ఎపిక్ కౌగిళింత!!
X
అసలు మన స్టార్ హీరోలు పబ్లిక్ లో కలిసేదే చాలా రేర్. ఎందుకంటే మనోళ్ళు ఎప్పుడూ తమ కుటుంబం తమ బెటాలియన్ అన్నట్లు బిజీగా ఉంటారు. కాని ఒక్కోసారి మాత్రం అనుకోకుండా కొన్ని సీన్లు తారసపడుతుంటాయి. అవి మనల్ని ఎంతగానో థ్రిల్ చేస్తుంటాయి.

ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో.. మెగాస్టార్ అండ్ బాలయ్య బాబు కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి మధ్యన అంత ఆత్మీయ స్నేహబంధం ఉందా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి గౌతమిపుత్ర శాతకర్ణి లాంచ్ కు విచ్చేసి.. ఇంకా తమ కెమెస్ర్టీని తారాస్థాయికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇక రెండవ తరం నుండి చూసుకుంటే.. రామ్ చరణ్‌ అండ్ ఎన్టీఆర్ తమ స్నేహంతో పిచ్చెక్కిస్తున్నారు.

ఆ మధ్యన ఒకసారి 'బాద్షా' సినిమా ఓపెనింగ్ కు.. రామ్ చరణ్ చీఫ్‌ గెస్టుగా విచ్చేశాడు. అప్పట్లో అందరూ శ్రీను వైట్ల కోరిక మీద వచ్చాడని అనుకున్నారు. కాకపోతే చరణ్‌ కేవలం ఎన్టీఆర్ కోసమే వచ్చాడని సన్నిహితులకే తెలుసు. ఇప్పుడిక జై లవ కుశ సినిమా సక్సెస్ అయ్యాక.. ఎన్టీఆర్ కు ఫోన్ చేసి విషెస్ తెలిపిన చరణ్.. ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీకి కూడా విచ్చేశాడు. చూశారుగా ఇద్దరూ ఎలా ఫోజులిస్తున్నారో. ఇదొక ఎపిక్ కౌగిళింత అని చెప్పాల్సిందే.

ఆ మధ్యన మహేష్‌ బాబుతో కలసి ఇదే విధంగా ఫారిన్లో కూడా కలసి చెక్కర్లు కొట్టిన చరణ్.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ఏదన్నా టూర్ వెళతాడో లేదో తెలియదు కాని.. ఇలా టాప్ హీరోలు స్నేహంగా ఉంటుంటే.. ఆ కిక్కే వేరబ్బా. వీరు పార్టీల్లోనే కాకుండా ఇలా సినిమాల్లో కూడా కలసి కనిపిస్తే బాగుంటుంది కదూ.