Begin typing your search above and press return to search.

శివతో చిరు - నో చేంజ్

By:  Tupaki Desk   |   23 Jan 2019 12:31 PM IST
శివతో చిరు - నో చేంజ్
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఖచ్చితమైన క్లారిటీ లేదు కాని తరువాత సినిమాల గురించి మాత్రం అప్పుడే హాట్ గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి. దీని తర్వాత చిరు అధికారికంగా కొరటాల శివకు కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే శివకు భరత్ అనే నేను తర్వాత ఎనిమిది నెలలు గ్యాప్ వచ్చినా చిరుతో చేసే ఛాన్స్ వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నాడు.

అయితే కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంలో కొరటాల శివ చెప్పిన ప్లాట్ చిరుకి నచ్చలేదని మొత్తం మార్చి వేరేది రాయమని చెప్పినట్టుగా వచ్చింది. ఇవి కాస్త తీవ్ర రూపంలో దాల్చి ఏకంగా క్యాన్సిల్ అవుతుందని ఒకరు లేదు కొరటాల శివకే విసుగొచ్చి బయటికి వస్తారని మరొక వర్గం ఇలా ఇష్టం వచ్చినట్టు వార్తలు గాలిలోకి వదిలారు. అయితే ఇవి మెగా కాంపౌండ్ నుంచి చరణ్ దాకా వెళ్ళిపోయాయి.

అఫ్ ది రికార్డు రియాక్ట్ అయిన చరణ్ ఎట్టి పరిస్థితుల్లో కొరటాల శివ సినిమా నాన్నతో ఉంటుందని కొన్ని కీలక మార్పుల గురించి మాత్రమే వాళ్ళు చర్చించుకున్నారని అంతే తప్ప వాయిదా లేదా రద్దు లాంటి ఆలోచనలు ఏమి లేవని తేల్చి చెప్పినట్టు సమాచారం.

అయితే స్టార్ట్ చేయడానికి కొంత టైం కావాలని మాత్రం చెప్పినట్టు తెలుస్తోంది. కొరటాల శివ సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలు ఏదీ మిస్ కాకుండా జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేసారని చిరు కోరిన మార్పులు సిద్ధమైన మరుక్షణం సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయిస్తారని తెలిసింది. సో కొరటాల చిరుల కాంబోల మూవీకి ఎలాంటి అడ్డంకులు లేనట్టే. లోకేషన్స్ వెతికే పనితో పాటు హీరొయిన్ల ఎంపికపై శివ ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసినట్టు సమాచారం