Begin typing your search above and press return to search.

సైరా బాధ్యతలు చిరు భుజాల పైకి

By:  Tupaki Desk   |   22 Jun 2019 6:33 AM GMT
సైరా బాధ్యతలు చిరు భుజాల పైకి
X
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి అనుకున్న టైంకి రావడం దాదాపు ఖాయమే. అక్టోబర్ 2ని అధికారికంగా ప్రకటించనప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం దానికి అనుగుణంగానే చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటిదాకా అంతా తానై వ్యవహరించిన నిర్మాత రామ్ చరణ్ ఇకపై ఆర్ ఆర్ ఆర్ లాంగ్ షెడ్యూల్ కోసం త్వరలో రాష్ట్రం వదిలి వెళ్లనున్నాడు. సుమారు నెలన్నరకు పైగా అందుబాటులో వచ్చే పరిస్థితి లేదు.

ఇప్పటికే పలు వాయిదాలతో షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చిన ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళి తన ప్లానింగ్ ను చాలా మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చరణ్ తారక్ లతో హైదరాబాద్ లో పార్ట్ పూర్తి చేశాక మొత్తం మహారాష్ట్ర షెడ్యూల్ మీద ఫోకస్ పెట్టనున్నాడు. అలియా భట్ అస్వస్థత మీదే న్యూ యార్క్ వెళ్ళడం ఇప్పటికే కొత్త టెన్షన్ పుట్టించింది

సో ఆర్ ఆర్ ఆర్ వ్యవహారంలో పడిపోతే సైరా మీద ఫోకస్ పెట్టలేడు కాబట్టి ఆ భాద్యతలు అన్ని నాన్న చిరంజీవికే చరణ్ అప్పజేప్పినట్టు సమాచారం. అవసరమైనప్పుడు సహకరించేలా బాబాయ్ నాగబాబు కూడా మాట ఇచ్చాడట. సో సైరాను వదిలి రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ కోసం వెళ్ళిపోతాడు. బిజినెస్ కు సంబంధించిన కీలకమైన డీల్స్ ఇప్పటికే పూర్తయినట్టు టాక్ ఉంది.

ఒకవేళ బాలన్స్ ఏమైనా ఉంటే చిరు పుట్టిన రోజైన ఆగస్ట్ 22కు చరణ్ వచ్చేస్తాడు కాబట్టి అప్పుడు వాటిని ఫైనల్ చేస్తారు. ఎంతలేదన్నా విడుదలకు నెల ముందు నుంచి సైరా ప్రమోషన్స్ కు చిరుతో పాటు చరణ్ కూడా చాలా యాక్టివ్ గా ఉండాలి. ఒకపక్క ఆర్ ఆర్ ఆర్ ని బాలన్స్ చేస్తూనే సైరాకు కో ఆపరేట్ చేయాలి. చూస్తుంటే చరణ్ కు ఈ హాఫ్ ఇయర్ మొత్తం ప్రెజర్ మాములుగా ఉండేలా లేదు