Begin typing your search above and press return to search.

RRR రిలీజ్ పై చ‌ర‌ణ్ క్లారిటీ ఇదే

By:  Tupaki Desk   |   8 Jan 2020 3:58 AM GMT
RRR రిలీజ్ పై చ‌ర‌ణ్ క్లారిటీ ఇదే
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న RRR రిలీజ్ సందిగ్ధ‌త‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నా.. ఇంకా విజువ‌ల్ ఎఫెక్ట్స్ - గ్రాఫిక్స్ వ‌ర్క్ పై పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్ప‌టికి 70శాతం చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే పూర్త‌యింది. అంటే మ‌రో 30 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాలి. అటుపై గ్రాఫిక్స్ కి సంబంధించిన కీల‌క‌మైన ప‌నుల్ని చేయాల్సి ఉంటుంది.

ఆ క్ర‌మంలోనే నెటిజ‌నుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జూలై 30 రిలీజ్ అని చెప్పారు. ఆ ప్ర‌కార‌మే రిలీజ్ ఉంటుందా? కేవ‌లం ఆరు నెల‌ల్లోనే ఇంత భారీ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ ప‌నుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది అన్న చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రాలేదు. కొత్త సంవ‌త్స‌రంలో అడుగు పెట్టినా చ‌ర‌ణ్.. ఎన్టీఆర్ ల‌కు సంబంధించిన లుక్ లను టీమ్ రిలీజ్ చేయ‌లేదు. అయితే సంక్రాంతి నుంచి ఆర్.ఆర్.ఆర్ ప్ర‌చారానికి టీమ్ ప్లాన్ చేస్తోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. తాజాగా చిత్ర క‌థానాయ‌కుడు రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ తేదీపై మ‌రోసారి ప‌క్కా క్లారిటీనిచ్చారు. ఈ చిత్రాన్ని ముందే ప్ర‌క‌టించిన తేదీకే రిలీజ్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఆ మేర‌కు ప‌నుల‌న్నీ వేగంగా పూర్త‌వుతున్నాయ‌ని 70శాతం చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యింద‌ని తెలిపారు.