Begin typing your search above and press return to search.

షాకిస్తున్న చెర్రీ కొత్త‌ అల‌వాటు!

By:  Tupaki Desk   |   8 Jan 2019 9:19 AM GMT
షాకిస్తున్న చెర్రీ కొత్త‌ అల‌వాటు!
X
త‌మ‌తో పాటు ప‌ని చేసే టీమ్ విష‌యంలో స్టార్ హీరోల ప్ర‌వ‌ర్త‌న గురించి చాలా సంద‌ర్భాల్లో ప‌లు ర‌కాల‌ అప్ డేట్స్ వినిపించాయి. అయితే టాలీవుడ్ లో కొంద‌రు స్టార్లు మాత్రం త‌మ కొలీగ్స్ ను దేవుళ్లుగా చూసుకుంటున్న వైనం గురించి తెలిసింది త‌క్కువే. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ త‌నతో పాటు సెట్స్ లో ప‌ని చేసేవాళ్ల‌ను ఎంత గౌర‌వంగా, ప్రేమ‌గా చూసుకుంటారో తెలిపే ఓ టాప్ సీక్రెట్ రివీలైంది. ఇంత‌కీ ఏమా సీక్రెట్ అంటే.. వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి ఓ అల‌వాటు ఉంది. సెట్స్ లో త‌న‌తో పాటే ప‌ని చేసేవాళ్లంద‌రికీ ఏరోజుకారోజు పాకెట్ మ‌నీని ఇవ్వ‌డం త‌న హ్యాబిట్. దీనిపై చ‌ర‌ణ్ మాట్లాడుతూ -``ఖైదీనంబ‌ర్ 150` టైమ్ నుంచి ఈ అల‌వాటు ఉంది. యూనిట్ లో అంద‌రికీ పాకెట్ మ‌నీ ఇస్తున్నా. చిన్న లైఫ్స్ వాళ్ల‌వి. అలా చేస్తే షూటింగ్ లో చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు`` అని తెలిపారు. `విన‌య విధేయ రామ‌` ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ ఈ సీక్రెట్ ని రివీల్ చేశారు.

అలాగే ఇండ‌స్ట్రీలో త‌న స్నేహాల గురించి చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ``తార‌క్ చాలా రోజులుగా నా స్నేహితుడు. మ‌హేష్ తో ఇటీవ‌లే స్నేహం మొద‌లు పెట్టాను. క్లోజ్ అవుతున్నాం`` అని తెలిపారు. గ‌త కొంత‌కాలంగా రామ్ చ‌ర‌ణ్ - తార‌క్- మ‌హేష్ కుటుంబాల మ‌ధ్య సాన్నిహిత్యం చూస్తున్న‌దే. న‌మ్ర‌త‌- ఉపాస‌న కొణిదెల స్నేహం పైనా ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. ప్ర‌స్తుతం స్టార్ల వైఫ్స్ అంతా ఒక‌రితో ఒక‌రు స్నేహంగా ఉంటున్నారు. ఒక‌రి ఇళ్ల‌లో వేడుక‌ల‌కు ఒక‌రు ఆహ్వానించుకుంటూ కొత్త సాంప్ర‌దాయానికి తెర తీశారు.

అంతే ఇదిగా స్టార్ హీరోలంతా ఒక‌రితో ఒక‌రు ఎంతో స‌న్నిహితంగానూ ఉంటున్నారు. చ‌ర‌ణ్‌, మ‌హేష్, తార‌క్, బ‌న్ని, ప్ర‌భాస్ .. వీళ్లంతా ఒక‌టే బ్యాచ్ అన్న‌ట్టుగా ఎంతో ఇదిగా క‌లిసిపోవ‌డం పైనా హాట్ హాట్ గా చ‌ర్చ సాగుతోంది. మొత్తానికి చ‌ర‌ణ్ ఇచ్చిన హింట్ ని బ‌ట్టి స్టార్లంతా `క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం` అని భావిస్తున్నార‌ని అర్థ‌మైంది. ఇది అభిమానుల్లోకి పాజిటివ్ సంకేతాల్ని పంపుతోంది కాబ‌ట్టి ప్ర‌శంసించ‌ద‌గిన ప‌రిణామ‌మే.