Begin typing your search above and press return to search.

చెర్రీ డెడ్ లైన్ పెట్టేశాడట

By:  Tupaki Desk   |   20 Sept 2016 6:45 PM IST
చెర్రీ డెడ్ లైన్ పెట్టేశాడట
X
మెగా హీరో రామ్ చరణ్.. ఇప్పుడు స్లోగా కనిపిస్తున్నాడు. ఆచితూచి సినిమాల ఎంచుకుంటూ జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. నిజానికి చరణ్ నటించిన ధృవ.. దసరాకే విడుదల కావాల్సి ఉన్నా.. ఇంకా కొంత పార్ట్ షూటింగ్ చేయాల్సి ఉంది. అక్టోబర్ 7న రామ్ చరణ్ ధృవ థియేటర్ల లోకి రావాల్సి ఉండగా.. పోస్ట్ పోన్ అయి.. డిసెంబర్ 2 డేట్ కి లాక్ అయ్యారనే టాక్ ఉంది.

అయితే.. సినిమా రిలీజ్ కి డిసెంబర్ వరకూ డేట్ ఇచ్చినా.. అక్టోబర్ చివరికల్లా మూవీ కంప్లీట్ అయిపోవాలని చెప్పాడట రామ్ చరణ్. ముందుగా అనుకున్న టైమ్ కంటే.. టైమ్ దొరికింది కదా అని.. సాగతీస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చేశాడట కూడా. చెర్రీ చెప్పిన ప్రకారం.. నవంబర్ రెండో వారం చివరకు.. దర్శకుడు సురేందర్ రెడ్డి ఫస్ట్ కాపీ చేతిలో పెట్టేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రిలీజ్ ప్లాన్ చేసిన తేదికి 15 రోజుల ముందే ఫస్ట్ కాపీ చేతిలో ఉంటే.. అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకునేందుకు తగినంత టైమ్ ఉంటుందని భావించడంతోనే.. రామ్ చరణ్ ఇలా ఆర్డర్స్ పాస్ చేశాడని తెలుస్తోంది.