Begin typing your search above and press return to search.
చెర్రీకి జపనీ ఫ్యాన్స్ షాకింగ్ ట్రీట్
By: Tupaki Desk | 23 April 2019 4:03 PM ISTహీరోలకు అభిమానులే ఆయువు. ఒకసారి అభిమానించడం మొదలైతే ఆ అభిమానం అంతకంతకు పెరుగుతుందే కానీ తరగదు. ఏదీ ఆశించని స్వచ్ఛమైన ప్రేమ అది. తమ అభిమాన స్టార్ కోసం ఏం చేసేందుకైనా ఫ్యాన్స్ వెనకాడరు. అందుకే అభిమానుల్ని మించిన ఇం`ధనం` సృష్టిలో ఇంకేదీ లేదని హీరోలు వేదికలపైనే ఓపెన్ గా కృతజ్ఞత చెబుతుంటారు. అయితే ఈ సువిశాల ప్రపంచంలో ఏదో ఒక మారుమూల ఉన్న హీరోని ఖండాంతరాల్లో ఎక్కడో విదేశంలో ఉన్న ప్రజలు అభిమానించడం అంటే అది నిజంగా ఎటర్నల్ ఫ్యానిజం అనే చెప్పాలి.
గత కొంతకాలంగా భారతీయ సినిమా ఖండాంతరాల్ని దాటుకుని వెళ్లి విదేశాల్లోనూ ఘనవిజయం సాధిస్తోంది. బాహుబలి సిరీస్ దేశ విదేశాల్లో రిలీజై ఘన విజయం అందుకుంది. ముఖ్యంగా జపాన్ లో బాహుబలి చిత్రం అఖండ విజయం సాధించింది. అంతకుమించి ప్రభాస్ .. రానా లాంటి స్టార్లకు జపాన్ లో వీరాభిమానులేర్పడ్డారు. ఆ ఇద్దరితో పాటు జపనీలు అభిమానించే వేరొక హీరో రామ్ చరణ్. అతడు నటించిన `మగధీర` జపాన్ లోనూ ఆదరణ దక్కించుకుంది. చరణ్ కు జపనీలు అభిమానులుగా మారారు. అందుకే ఇప్పుడు చరణ్ నటించిన `రంగస్థలం` చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఎలానూ జపాన్ దేశానికి వెళుతుంది. బాహుబలి దర్శకుడి నుంచి వస్తున్న క్రేజీ చిత్రం అంటూ ఆర్.ఆర్.ఆర్ ను అక్కడ ఎలానూ రిలీజ్ చేస్తారు. ఈ సినిమాతో తారక్ కి వీరాభిమానులేర్పడతారనడంలో సందేహమే లేదు.
ఈ పరిణామం చూస్తుంటే.. చైనా.. జపాన్ మార్కెట్లను టార్గెట్ చేస్తున్న మన స్టార్లు అక్కడ క్రమంగా అభిమానుల్ని పెంచుకోవడంలోనూ పోటీ పడుతున్నారనే అర్థమవుతోంది. రజనీకాంత్ - ప్రభాస్ - రామ్ చరణ్ - రానా లకు జపాన్ లో అభిమానులున్నారు. ఇంకా ఈ లీగ్ లోకి ఇతర హీరోలు చేరే అవకాశం ఉంది. తాజాగా రామ్ చరణ్ కి జపనీ అభిమానులు లేఖలు రాయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ తరహాలో లేఖలు చరణ్ కి కొరియర్ లో అందాయిట. వీటిని ఉపాసన రామ్ చరణ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు షేర్ చేశారు. చరణ్ ఈ లేఖలపై ఆనందం వ్యక్తం చేశారు. ``జపాన్ అభిమానుల నుంచి స్వీట్ సర్ ప్రైజ్ అందుకున్నా. మీ అభిమానానికి ధన్యవాదాలు. సాధ్యమైనంత తొందర్లోనే మిమ్మల్ని కలుసుకుంటాను..`` అని సామాజిక మాధ్యమాల్లో రిప్లయ్ ఇచ్చారు. ఈ లేఖల్లోనే రామ్ చరణ్ ని ఆర్ట్ గా డ్రా చేసి అభిమానం చూపారు కొందరు ఫ్యాన్స్. ఆ చిత్రలేఖనం నైపుణ్యానికి ఉపాసన ప్రశంసలు కురిపిస్తూ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మిస్టర్ సి- నేను మీ ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అని ట్వీట్ చేశారు ఉపాసన.