Begin typing your search above and press return to search.

అభిమానుల‌ కుటుంబాల‌కు చెక్కులు అందించిన చర‌ణ్

By:  Tupaki Desk   |   12 Sept 2020 1:40 PM IST
అభిమానుల‌ కుటుంబాల‌కు చెక్కులు అందించిన చర‌ణ్
X
అభిమానం హ‌ద్దుమీరితే అది ఎంత స‌మ‌స్యాత్మ‌క‌మో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రాణ‌త్యాగానికైనా సిద్ధ‌ప‌డేంత అభిమానం అస్స‌లు వ‌ద్దే వ‌ద్దని అంటున్నారు రామ్ చ‌ర‌ణ్‌. ముందు మీ ప్రాణాల‌కు ఎలాంటి హానీ లేకుండా సుర‌క్షితంగా ఉండ‌డం ముఖ్యంగా. మీ కుటుంబాలు బావుంటేనే అంద‌రూ బావున్న‌ట్టు! అంటూ త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కాడు రామ్ చ‌ర‌ణ్‌.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కుప్పం-పాలమనేరు హైవేలో విద్యుదాఘాతంతో ముగ్గురు అభిమానులు కన్నుమూశారు. ఆ ఘ‌ట‌న అనంత‌రం వారి కుటుంబ స‌భ్యుల‌ను ఆదుకునేందుకు మెగా యువ‌హీరోలంతా ముందుకు వ‌చ్చారు. ఆ ఘ‌ట‌న‌ల‌కు సంతాపాన్ని తెలియజేస్తూ మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.

ఈ సంద‌ర్భంగా మెగా పవర్ ‌స్టార్ రామ్ చరణ్ ఒక వ్యక్తిగత ప్ర‌క‌ట‌న చేశారు. ``కుప్పంలో ఏమి జరిగినా అది చాలా హృదయ విదారకం. అభిమానుల‌ ఆత్మలు ప్రశాంతంగా ఉండనివ్వండి. మీ ఆరోగ్యం జీవితం కంటే మరేదీ ముఖ్యం కాదని నేను అభిమానులకు చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి పనులు చేసేటప్పుడు అభిమానులందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా సురక్షితంగా ఉండండి`` అని అన్నారు. వాగ్దానం చేసినట్లుగానే రామ్ చరణ్ మ‌ర‌ణించిన అభిమానుల‌ కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి 2.5 లక్షల చొప్పున‌ చెక్కును అందజేశారు. ఆయా కుటుంబాల్ని ఆదుకుంటామ‌ని భ‌రోసాను ఇచ్చారు. గ‌తంలోనూ మెగా ఫ్యామిలీ నుంచి మెగాభిమానుల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా ఈ త‌ర‌హాలో ఆదుకున్నారు. ఇప్ప‌టికీ మెగా అభిమాన సంఘాల శ్రేయ‌స్సు కోసం నాగ‌బాబు అండ్ టీమ్ కృషి చేస్తూనే ఉన్నారు.