Begin typing your search above and press return to search.

అభిమానంలో ఇదో రకం పిచ్చి..

By:  Tupaki Desk   |   15 Feb 2016 5:33 AM GMT
అభిమానంలో ఇదో రకం పిచ్చి..
X
స్టార్ హీరోలను దేవుళ్ల రేంజ్ లో ఆరాధించడం మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న కల్చర్. అందుకే సినిమా రిలీజయినప్పుడు.. కటౌట్లకు దండాలు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం చూస్తూనే ఉన్నాం. తమ అభిమాన హీరోని ఆరాధ్య దేవుడిగా కొలవడం వాళ్ల అభిమానం స్థాయిని చూపిస్తుందని సరిపెట్టుకుందామంటే.. ఈ మధ్య ఈ పిచ్చి పీక్స్ కి వెళ్లిపోతుంది.

వేలంటైన్స్ డే రోజున.. రామ్ చరణ్ తేజ్ నటించిన బ్రూస్ లీ చిత్రాన్ని టెలికాస్ట్ చేసింది ఓ ఛానల్. ఇదే మొదటి సారి ప్రసారం చేయడం కావడంతో.. మంచి రేటింగులు వస్తాయనే అంచనాలున్నాయి. అయితే.. టీవీల్లో బ్రూస్ లీ వస్తున్నంత సేపు ఫ్యాన్స్ హంగామా చేయడం ఎక్స్ పెక్ట్ చేసే విషయమే. ఈసారి కనిపించిన లేటెస్ట్ డెవలప్ మెంట్ ఏంటంటే.. బుల్లితెరపై ఉన్న రామ్ చరణ్ కు దండాలు పెట్టడం హారతులు ఇవ్వడం. ఓ స్టెప్ వేసినా, ఓ ఫైట్ చేసినా ఓ డైలాగ్ పేల్చినా.. ఇలా చెర్రీ ఏం చేసినా హారతులు పట్టేశారు చాలాచోట్ల.

టివిల్లో సినిమాలు వస్తుంటే అభిమానులు ఇలా పూజలు చేయడం మాత్రం టూమచ్ అనాల్సిందే. అఫ్ కోర్స్ ఎవడి గోల వాడిది, ఎవరి పిచ్చి వారిదే అని కూడా అనుకోవచ్చు. గతంలో మహేష్‌ బాబు సినిమాలకు కూడా ఇలాగే హారతులు పట్టేశారు. అసలీ టీవీల్లో బొమ్మలకు పూజలు చేసే ట్రెండ్ ను మన తెలుగు రాష్ట్రాల జనాలే స్టార్ట్ చేశారని గర్వంగా చెప్పేసుకోవచ్చు.