Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ః 'ఆచార్య'లో చరణ్‌ ఇలా

By:  Tupaki Desk   |   3 Jan 2021 5:30 PM GMT
పిక్‌ టాక్‌ః ఆచార్యలో చరణ్‌ ఇలా
X
మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తో క్లారిటీ ఇచ్చారు. లీక్‌ అయిన కొన్ని ఫొటోలతో కూడా చిరు లుక్‌ పై స్పష్టత వచ్చింది. అయితే ఆచార్య సినిమాలో చరణ్ ఎలా కనిపించబోతున్నాడు అనేది ఇప్పుడు అందరికి ఉత్కంఠతను రేకెత్తిస్తున్న విషయం. ఆచార్య సినిమా షూటింగ్‌ లో చరణ్ ఎప్పటి నుండి జాయిన్‌ అయ్యేది కూడా క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో ఆచార్యలో చరణ్ ఇలా అంటూ ఒక పోస్టర్‌ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.

మెగా అభిమానులు విపరీతంగా షేర్‌ చేసిన ఆ పోస్టర్‌ ఒక ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ అంటూ ఆ తర్వాత వెళ్లడయ్యింది. అద్బుతంగా ఉన్న ఆ పోస్టర్‌ ను చూసిన అభిమానులు ఆచార్యలో చరణ్‌ ఇలాగే ఉంటే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆచార్య యూనిట్‌ సభ్యులు లీక్ చేశారేమో అని అభిమానుల అభిప్రాయం కోసం లీక్ చేసి ఉంటారేమో అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఈ పోస్టర్‌ తో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.