Begin typing your search above and press return to search.

అబ్బో.. అంత వీజీగా లేదయ్యా చెర్రీ

By:  Tupaki Desk   |   13 Aug 2015 5:59 PM IST
అబ్బో.. అంత వీజీగా లేదయ్యా చెర్రీ
X
రామ్‌ చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో విజేత తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పండగల వేళ సోలోగా వచ్చి కాసులు కొల్లగొట్టి వెళ్లిపోతానంటే ఈసారి కుదిరేట్టు లేదు. రేసులో చరణ్‌ కి ధీటుగా పోటీ ఇచ్చేవాళ్లు బరిలో దిగుతున్నారు.

ఈసారి దసరాకి మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు రిలీజవుతున్నాయి. అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం దసరా బరిలోనే రిలీజవుతోంది. అలాగే చియాన్‌ విక్రమ్‌-సమంత జంటగా నటించిన 10 ఎంద్రాతుకుళ్ల ఈ సీజన్‌ లోనే రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌.మురుగదాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం వల్ల అసాధారణ క్రేజు వచ్చింది ఇప్పటికే.

అక్టోబర్‌ 15న చరణ్‌ సినిమా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా వారం గ్యాప్‌ తో అఖిల్‌ సినిమా వస్తుంది. సేమ్‌ టైమ్‌ విక్రమ్‌ చిత్రం వస్తుంది. ఒకవేళ చరణ్‌ అనుకున్న టైముకి రాలేకపోతే ఒకేరోజు మూడు క్రేజీ సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మూడింటి మధ్యా ఠఫ్‌ ఫైట్‌ షురూ అన్నమాట!