Begin typing your search above and press return to search.
మిస్టర్ -సి సండే బ్రేక్ ఫాస్ట్ హవ్వ!
By: Tupaki Desk | 17 Sept 2018 11:11 AM ISTమిస్టర్ - సి ప్రస్తుతం అజర్ భైజాన్ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ & టీమ్ పై భారీ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పాతిక రోజుల సుదీర్ఘమైన షెడ్యూల్ ఇదని ఇదివరకూ బోయపాటి టీమ్ ప్రకటించింది. అజర్ భైజాన్ లోని టన్నెల్స్ లో - భారీ భవంతుల నడుమ భారీ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయని తెలిసింది. అలానే పారా గ్లైడింగ్ లాంటి ప్రమాదకర సాహసోపేతమైన సన్నివేశాల్ని ఈ సినిమాలో చరణ్ చూపించబోతున్నారు.
మునుపెన్నడూ చూడని రేర్ లొకేషన్లను వెతికి అక్కడ చిత్రీకరణ సాగిస్తున్నారు. అదంతా సరే.. అజర్ భైజాన్ లో రామ్ చరణ్ అండ్ టీమ్‌కి ఆన్ లొకేషన్ అన్ని వసతులు బాగానే సమకూరాయా? అంటే కాస్తంత సందేహం రేకెత్తింది. ఎందుకంటే ఉపాసన తాజా ట్వీట్ లో చరణ్ చాక్లెట్లు తింటూ కనిపించాడు. సండే బ్రేక్ ఫాస్ట్ చాక్లెట్లు - రసగుల్ల తిన్నాడట.
దీన్నిబట్టి అతడు ప్రధానమైన నగరంలో కాకుండా ఇంటీరియర్ ప్లేస్ లో షూటింగ్ కి వెళ్లారని అర్థమవుతోంది. వెంట తెచ్చుకున్న చాక్లెట్లు - రసగుల్లా తిని సండే వరకూ అడ్జస్ట్ అయ్యారు పాపం. అన్నట్టు అజర్ భైజాన్ లో టిఫిన్ దొరకదా? ఇడ్లీ - వడ వగైరా అనే సందేహాలేమైనా వస్తే - వాటికి చరణ్ కానీ ఉపాసన కానీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యో పాపం చరణ్.. సూపర్ మార్కెట్ వెళ్లి చాక్లెట్లు కొనుక్కున్నాడు. వాటినే సండే టిఫిన్ గా సరిపెట్టుకున్నాడట.