Begin typing your search above and press return to search.
సల్మానూ.. చరణ్ ను వాడుకోడమేనా??
By: Tupaki Desk | 20 Oct 2015 11:00 PM ISTఇప్పుడు టాలీవుడ్ లో ఒకటే హాట్ టాపిక్. సల్మాన్ ఖాన్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు డబ్బింగ్ చెబుతున్నాడు అనే విషయం గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు అయితే.. సల్మాన్ కు ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకు డబ్బింగ్ చెబుతున్నందుకు హ్యాపీగానే ఉన్నారు కాని.. ఒక విషయం మాత్రం కాస్త గట్టిగా అడిగేస్తున్నారు.
నిజానికి బాలీవుడ్ లో జంజీర్ సినిమా ఫ్లాప్ అయిన తరువాత.. ఇక హిందీలో చరణ్ చేయడని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్లే మనోడు కూడా ఇప్పటివరకు హిందీలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కాకపోతే అప్పట్లో సల్మాన్ ఖాన్ ఏమన్నాడంటే.. హిందీ ఎరీనాలో చరణ్ సత్తా తాను చాటుతానని చెప్పుకొచ్చాడు. ఇద్దరూ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ చేద్దాం అని కూడా చెప్పాడు. కాని ఇంతవరకు అది మెటీరియలైజ్ కాలేదు.
మా చరణ్ తో డబ్బింగులు గట్రా చెప్పించేసుకుంటున్నావు కాని.. మా వాడితో హిందీలో సినిమా మాత్రం చేయట్లేదు సల్మానూ అంటూ ఇప్పుడు అభిమానులు అడగుతున్నారు. ఏమయ్యా సల్మాన్.. ఆ సినిమా గురించి కాస్త చెప్పవయ్యా బాబూ.. బహుశా ప్రేమ్ రతన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వస్తాడుగా.. అప్పుడు ఖచ్చితంగా చరణ్ కూడా వచ్చే ఛాన్సుంది.. సో.. అప్పుడేమైనా చెప్తాడేమో!!