Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా కేట‌గిరీలో `ధృవ` సీక్వెల్?

By:  Tupaki Desk   |   5 Nov 2020 11:30 AM IST
పాన్ ఇండియా కేట‌గిరీలో `ధృవ` సీక్వెల్?
X
సెట్స్ లో భారీ సినిమాలు చిత్రీక‌ర‌ణ‌లో ఉంటే అవి రిలీజ‌య్యే వ‌ర‌కూ సస్పెన్స్ త‌ప్ప‌డం లేదు. పైగా మ‌హ‌మ్మారీ క్రైసిస్ ఎదురైతే ఇలాంటి సీజ‌న్ లో ఇలాంటి భారీ పాన్ ఇండియా సినిమాల్ని ఎప్ప‌టికి పూర్తి చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న‌దానిపై క్లారిటీ మిస్స‌వుతుంది. అలాంట‌ప్పుడు వేరే ప్రాజెక్టుల‌కు క‌మిటైపోయినా కాల్షీట్లు స‌ర్ధుబాటు చేయ‌డం బిజీ షెడ్యూల్స్ ని మ్యానేజ్ చేయ‌డం హీరోల‌కు ఆషామాషీ కానే కాదు. హీరో కం నిర్మాత అయితే ఆ టెన్ష‌న్ అంతా బుర్ర‌లో హీట్ పెంచేస్తుంది.

అందుకే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నార‌ట‌. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ .. మ‌రోవైపు డాడీతో ఆచార్య ఈ రెండూ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌విగా చ‌ర‌ణ్ భావిస్తున్నారు. ఈ రెండిటినీ క్రైసిస్ స‌మ‌యంలో ప్రారంభించ‌డంతో అనుకున్న విధంగా ఏదీ సాగ‌డం లేదు. దీంతో డైల‌మాలో ఉన్నా రామ్ చ‌ర‌ణ్ .. ఆ రెండిటి త‌ర్వాతా ఏం చేయాలి? అన్న‌దానిపై అస్స‌లు ఆలోచించ‌డం లేద‌ట‌.

నిజానికి త‌న‌ బ్లాక్ బ‌స్ట‌ర్ `ధృవ‌` సీక్వెల్లో న‌టించేయాల‌న్న క‌సి చ‌ర‌ణ్ కి ఉంది. త‌ని ఒరువ‌న్ ద‌ర్శ‌కుడు సీక్వెల్ ప‌నుల్లో ఉన్నారు కాబ‌ట్టి దానిపై శ్ర‌ద్ధ పెట్టాల‌ని భావించారు. కానీ ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న ఆర్.ఆర్.ఆర్ దాంతో పాటే సెట్స్ కెళుతున్న ఆచార్య కోస‌మే పూర్తి స్థాయిలో ఆలోచించాల్సి ఉంది. ఆచార్య‌కు నిర్మాత గా పూర్తి న్యాయం చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే షూట్ నెలల పాటు ఆలస్యం అయింది. కరోనావైరస్ మహమ్మారి అంతా మార్చేసింది. అందుకే సాటి హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు క‌మిట‌వుతున్నా చ‌ర‌ణ్ మాత్రం ఏదీ ఫైన‌ల్ చేయ‌డం లేద‌ట‌. క‌థ‌లు విన్నా చాలా న‌చ్చ‌లేద‌ని రిజెక్ట్ చేసి పంపార‌ట‌.

అలాగే ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ రిలీజ‌య్యాక త‌న మార్కెట్ రేంజ్ మారుతుంద‌న్న హోప్ తోనూ చ‌ర‌ణ్ ఉన్నారు. ఆ మూవీ రిజ‌ల్ట్ అతని తదుపరి ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుంది. అందువల్ల అతను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే ఒక ప్రాజెక్ట్ ను చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నార‌ట‌. ఒక పాన్ ఇండియా తర్వాత స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేయాలనే ఆలోచనలో మొదట్లో ఉన్నప్పటికీ చరణ్ ‌కు ఇప్పుడు ప్లాన్ మారింద‌ట‌. త‌దుప‌రి కూడా వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌కే ఆయన ప్లాన్ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. ధృవ 2 ని కూడా ఈ కేట‌గిరీలోనే చేయాల‌న్న ఆలోచ‌న‌తో చ‌ర‌ణ్ ఉన్నాడ‌న్న గుస‌గుస‌లు వినిఇస్తున్నాయి.