Begin typing your search above and press return to search.

ధృవ సీక్వెల్ .. వేడి పెంచే లీకు ఇదిగో

By:  Tupaki Desk   |   16 Oct 2020 10:00 AM IST
ధృవ సీక్వెల్ .. వేడి పెంచే లీకు ఇదిగో
X
రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో ధృవ సెన్సేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ని వ‌రువ‌న్ రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళ చిత్రంలానే తెలుగులోనూ ధృవ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేశార‌ని స్టార్ల‌తో మాట్లాడుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అంతేకాదు.. రామ్ చరణ్ ఒక చిత్రం కోసం ఇటీవ‌ల‌ మోహన్ రాజాతో చర్చలు జరుపుతున్నట్లు ప్ర‌చార‌మైంది. ఇంకా దీనిపై అధికారిక‌ ధృవీకరణ లేక‌పోయినా మెగాభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అభిమానులకు సంతోషం క‌లిగిస్తున్న విష‌య‌మిది.

ఇప్పుడు తాజా గాసిప్ ఏమిటంటే, .. ధ్రువ సీక్వెల్ కోస‌మే చ‌ర‌ణ్ మోహ‌న్ రాజాని క‌లిసార‌ని తెలుస్తోంది. ఈ సీక్వెల్లో రామ్ చరణ్ ను ప‌వ‌ర్ ఫుల్ పోలీసుగా ఆవిష్క‌రిస్తారు. అయితే అరవింద్ స్వామి విలన్ పాత్ర చ‌నిపోయింది కాబ‌ట్టి త‌ర్వాత విల‌న్ ఎవ‌రు.. క‌థేంటి? అన్న‌ది వేచి చూడాలి. అలాగే సీక్వెల్ ప్రధాన విలన్ చనిపోయిన చోటు నుండి షో స్టోరీ కొనసాగుతుంది. ఇప్ప‌టికి ఇదంతా ఊహాగానాలే కాబ‌ట్టి అధికారికంగా ప్ర‌క‌టించేవ‌ర‌కూ వేచి చూడాల్సిందే. ఈ చిత్రం ఎప్ప‌టికి కార్యరూపం దాల్చుతుందో ఆగి చూడాలి.