Begin typing your search above and press return to search.

ధృవ గురించి కొన్ని కొత్త కబుర్లు

By:  Tupaki Desk   |   1 Sept 2016 10:13 AM IST
ధృవ గురించి కొన్ని కొత్త కబుర్లు
X
రామ్ చరణ్ ధృవ విడుదలకు ఐదు వారాలే సమయం ఉందిక. ఇక ప్రమోషన్ హడావుడి పెంచాల్సిందే. మొదట్నుంచి ఈ సినిమా కొంచెం లో ప్రొఫైల్లో నడుస్తోంది. ఐతే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయ్యాక హైప్ మొదలైంది. ఇప్పుడిక తర్వాతి తంతుకు సమయం ఆసన్నమైంది. ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్సయింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 5న ధృవ ఫస్ట్ టీజర్ రిలీజవుతుందని సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్ల లాగే టీజర్ కూడా చాలా స్టైలిష్ గా.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ‘ధృవ’ బిజినెస్ కు సంబంధించి వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ చిత్రం వైజాగ్ ఏరియా హక్కులు ఏకంగా రూ.5.4 కోట్లకు అమ్ముడవడం విశేషం. ‘బ్రూస్ లీ’ లాంటి ఫ్లాప్ తర్వాత చరణ్.. ‘కిక్-2’ లాంటి ఫ్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమాకు ఈ రేటు రావడమంటే విశేషమే. మరోవైపు రాయలసీమ ఏరియాకు కూడా ‘ధృవ’ మంచి రేటే పలికినట్లు సమాచారం. ఆ హక్కులు రూ.9 కోట్లు పలికాయట. సినిమా మీద హైప్ బాగానే ఉందనడానికి నిదర్శనలు ఈ రేట్లు. మిగతా ఏరియాల్లోనూ మంచి ఆఫర్లే వస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ‘ధృవ’ బిజినెస్ రూ.50 కోట్లు దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టీజర్.. ట్రైలర్ రిలీజయ్యాక సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.