Begin typing your search above and press return to search.

అబ్బాయ్ బుల్లెట్‌ పై... బాబాయ్ సైకిల్‌ పై

By:  Tupaki Desk   |   28 Oct 2016 3:35 PM GMT
అబ్బాయ్ బుల్లెట్‌ పై... బాబాయ్ సైకిల్‌ పై
X
దీపావ‌ళికి కొత్త సినిమాల సంద‌డేమీ లేదు. కాష్మోరా - ధ‌ర్మ‌యోగిలాంటి డ‌బ్బింగ్ బొమ్మ‌ల‌దే హ‌డావుడి. అయితే మ‌న హీరోలు మాత్రం ఫ‌స్ట్‌ లుక్‌ ల‌తో ఈ పండ‌గ చేయించ‌బోతున్నారు. మ‌న హీరోలంతా కూడా సంక్రాంతిని - వేస‌వినే టార్గెట్ చేసుకొన్నారు. దాంతో వారి సినిమాలన్నీ ప్ర‌స్తుతం సెట్స్‌ పైనే ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫ‌స్ట్‌ లుక్‌ ల్నీ - టీజ‌ర్ల‌నీ ఈ పండ‌గ‌కి విడుద‌ల చేస్తున్నారు. చిరంజీవి 150వ చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`తోపాటు - బాల‌కృష్ణ `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` - వెంక‌టేష్ `గురు` చిత్రాల‌కి సంబంధించిన లుక్‌ లు రేపే విడుద‌ల కాబోతున్నాయి. వాటికంటే ఒక రోజు ముందుగానే బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అబ్బాయి రామ్‌ చ‌ర‌ణ్ త‌మ కొత్త చిత్రాల్లోని లుక్కుల‌తో సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్టారు.

చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ధృవ‌`లోని స్టైలిష్ లుక్ బ‌య‌టికొచ్చింది. బుల్లెట్‌ పై దూసుకెళుతున్న లుక్ అది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం సింపుల్‌ గా అద‌ర‌గొట్టాడు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న కాట‌మ‌రాయుడుకి సంబంధించిన లుక్ ఆన్‌ లైన్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. ఆ లుక్‌ లో ప‌వ‌న్ సైకిల్‌ పై వెళుతున్నాడు. ఆ స్మైల్‌ - ఆ ఛార్మింగ్ లుక్ అభిమానుల్ని సంతోష‌పెడుతోంది. మ‌రి రేపు చిరంజీవి సంద‌డి ఎలా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/