Begin typing your search above and press return to search.

చిరు సినిమాకు చరణ్ లింక్ పెట్టాడా?

By:  Tupaki Desk   |   9 Feb 2019 7:02 PM IST
చిరు సినిమాకు చరణ్ లింక్ పెట్టాడా?
X
కోట్ల రూపాయలతో ముడిపడిన ఓ స్టార్ హీరో భారీ సినిమా డిజాస్టర్ అయితే దాని పరిణామాలు ఎంత స్థాయిలో ఉంటాయో వినయ విధేయ రామ విషయంలో చూస్తూనే ఉన్నాం. ఒకపక్క బయ్యర్లు 30 కోట్ల దాకా నష్టపోతే మరోపక్క నిర్మాత దానయ్య దర్శకుడు బోయపాటి శీనుల మధ్య ఏదో రచ్చ జరిగిందనే టాక్ ఇంకా చల్లారనే లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న మరో ప్రచారం కొత్త అనుమానాలు రేపుతోంది.

దాని ప్రకారం వినయ విధేయ రామ నష్టాలు అంత సులభంగా కోలుకోలేని స్థాయిలో ఉన్నాయి కాబట్టి భవిష్యత్ లో త్రివిక్రమ్ తో నాన్న చేయబోయే సినిమాకు ఫేవర్ జరిగే విధంగా చూస్తానని చరణ్ మాట ఇచ్చాడట. ఇది అసంబద్ధమైన కథనం అని చెప్పొచ్చు. ఎందుకంటే దానయ్య ఇప్పుడు ఆల్రెడీ చరణ్ తో తారక్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. రిలీజ్ కు ఏడాదిన్నర ముందే ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. సో అలా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే చరణ్ ఆర్ఆర్ఆర్ తోనే చేయొచ్చు. దానికి తోడు సైరా ఫినిష్ అయ్యాక చిరు వెంటనే కొరటాల శివ ప్రాజెక్ట్ లోకి ఎంటరైపోతారు.

త్రివిక్రమ్ కు ఇతరత్రా కమిట్ మెంట్స్ వేరే ఉన్నాయి. అల్లు అర్జున్ తర్వాత వెంకటేష్ తో చేయాల్సి ఉంది. ఇవన్నీ కొలిక్కి రావడానికి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. అప్పటిదాకా వినయ విధేయ రామ నష్టాల కోసం చరణ్ దానయ్యకు ఫెవర్ చేస్తూనే ఉండాలా. అయినా దాని విషయంలో నష్టపోయింది బయ్యర్లు. సగం దాకా ఆల్రెడీ సర్దేసారు. పూర్తిగా ఏ నిర్మాతా చేయలేడు. అలా డిమాండ్ చేయడం భావ్యం కాదు కూడా. మరి ఇప్పుడు చరణ్ సినిమా నష్టాలకు చిరంజీవి ఎప్పుడో చేయబోయే సినిమాకు లింక్ పెట్టడం చూస్తే మోకాలికి బోడి గుండుకు సామెత గుర్తుకు వస్తుంది.