Begin typing your search above and press return to search.

మిసెస్ కోసం వంట విందు

By:  Tupaki Desk   |   16 April 2020 9:30 AM IST
మిసెస్ కోసం వంట విందు
X
ప్ర‌పంచానికి క‌రోనా విప‌త్తు బోలెడంత నేర్పిస్తోంది. లాక్ డౌన్ వ‌ల్ల‌ చాలా కోణాల్లో న‌ష్టం ఉన్నా.. కొన్ని కోణాల్లో మేలు చేస్తోంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ముఖ్యంగా బంధాలు అనుబంధాల్ని పెంపొందించిన ఘ‌న‌త క‌రోనా కే చెల్లింది. నిరంత‌రం బిజీ లైఫ్ పేరుతో దంప‌తుల మ‌ధ్య దూరం త‌ప్ప‌డం లేదు. కుటుంబీకుల‌కు క‌లుసుకునేది త‌క్కువే. అయితే ఒకే ఒక్క క‌రోనా అన్నిటికీ చెక్ పెట్టేసింది. కుటుంబ జీవ‌నాన్ని అల‌వాటు చేసింది. వాతావ‌ర‌ణంలో ఆక్సిజ‌న్ ని పెంచి మ‌నిషి ధ‌న‌దాహానికి బ‌లైన ప్ర‌కృతిని తిరిగి పురోగ‌మించేలా చేసింది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధాల్ని పెంచుతోంది.

ఇక సెల‌బ్రిటీలంతా మునుపెన్న‌డూ లేనంత‌గా వారి కుటుంబాల‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. స్వీయ దిగ్బంధం సమయంలో వ్యాయామం చేయ‌డం.. రుచిక‌ర‌మైన వంట‌కాలు వండి త‌మ‌ కుటుంబ సమయాన్ని ఎక్కువగా ఆస్వాధిస్తున్నారు. ఇటీవ‌ల ప‌లువురు టాప్ స్టార్లు స్వీయ నిర్భంధంలో ఇంటి ప‌నులు చేస్తున్న ఫోటోలను.. వీడియోల్ని షేర్ చేయ‌డం వాటిని అభిమానులు జోరుగా వైర‌ల్ చేయ‌డం చూస్తున్న‌దే.

తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తన వంట నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. భార్య ఉపాస‌నకు ఇష్ట‌మైన వంట‌కాన్ని ఎంతో ప్రేమ‌గా వండుతున్నారు చ‌ర‌ణ్‌. `మిసెస్ కోసం వంట విందు` అంటూ ఆనందం వ్య‌క్తం చేశాడు. చెర్రీ ఎంతో రుచికరమైన విందును ఎలా సిద్ధం చేస్తున్నాడో అది కూడా త‌న ప‌ర్యవేక్ష‌ణ‌లో సాగుతున్న వైనాన్ని మిస్సస్ ఉపాస‌న‌ వీడియోగా రికార్డ్ చేసారు. ఇక ఆ ఇద్దరి అన్యోన్య‌త గురించి చెప్పాల్సిందేముంది. శ్రీ‌మ‌తికి అరుదైన కానుక‌లు ఇవ్వ‌డంలో చ‌ర‌ణ్ త‌ర్వాత‌నే. ``నాకోసం వంట వండారు మిస్ట‌ర్ సి. వండిన‌ త‌ర్వాత మొత్తం కిచెన్ శుభ్ర‌ప‌రిచాడు. భ‌ర్త‌లంద‌రికీ స్ఫూర్తి నింపేదే. ఆయ‌న‌ను రియ‌ల్ హీరోని చేసింది వంట‌`` అంటూ ఉపాస‌న ట్వీట్ చేశారు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ పూర్త‌యితే త‌దుప‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉంది. అలాగే మెగాస్టార్ ఆచార్య‌లోనూ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడు.