Begin typing your search above and press return to search.

సుక్కుని కంట్రోల్ చేస్తున్న చెర్రీ

By:  Tupaki Desk   |   20 July 2017 11:50 AM IST
సుక్కుని కంట్రోల్ చేస్తున్న చెర్రీ
X
ధృవతో దూకుడు చూపించిన రామ్ చరణ్.. ఇప్పుడు సుకుమార్ తో పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. కమర్షియల్ థ్రిల్లర్ చేసిన వెంటనే.. 1980ల కాలం నాటి పల్లెటూరి ప్రేమకథ చేసేందుకు అంగీకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంగస్థలం 1985 అంటూ ఇప్పటికే ఈ చిత్రానికి టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు.

అయితే.. అసలీ మూవీలో ఏం చూపించబోతున్నారో.. ఏ జోనర్ కి సంబంధించిన మూవీనో అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడని.. 1980ల కాలం నాటి మూవీ అని తప్ప మరింకేమీ జనాలకు తెలియదు. లోగో డిజైన్ తప్ప వేరే ఏ అప్ డేట్ అఫీషియల్ గా రిలీజ్ కాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించిన అనేక పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా అయితే.. సుకుమార్ ఏదో చేయబోతోంటే.. దర్శకుడిని పట్టుకుని రామ్ చరణ్ ఏదో చెబుతున్నట్లుగా ఉన్న ఫోటో ఒకటి ఆసక్తి కలిగిస్తోంది.

షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో అనే సంగతి తెలుస్తూనే ఉంది కానీ.. సుక్కు ఏం చేయబోతున్నాడు.. రామ్ చరణ్ ఏం చెబుతున్నాడో చెప్పడం క్లిష్టమైన విషయమే. ఇక సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తొలిసారిగా మెగాపవర్ స్టార్ తో స్టార్ భామ సమంత నటిస్తున్న మూవీ కావడంతో.. టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ కాంబోపై ఆసక్తి ఎక్కువగానే ఉంది.