Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు చరణ్ కాంప్లిమెంట్స్!
By: Tupaki Desk | 19 Jan 2016 7:03 PM ISTసీనియర్ హీరోలకు కొంచెం ఇగోస్ ఎక్కువ కానీ.. ఈ తరం హీరోలు మాత్రం అలాంటి భేషజాలేమీ చూపించరు. స్టార్ హీరోలు ఒకరితో ఒకరు బాగానే కలిసిపోతారు. ఇంటర్వ్యూల్లో వేరే హీరోల పేరెత్తడానికి.. కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి పెద్దగా సంకోచించరు. మొన్న ‘నాన్నకు ప్రేమతో’ విడుదల నేపథ్యంలో ఇంటర్వ్యూ ఇస్తూ ‘నాయక్’ - ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాల సక్సెస్ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు రామ్ చరణ్ స్వయంగా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి అతడికి అభినందనలు తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో’ సినమాలో పెర్ఫామెన్స్ కు సంబంధించి ఎన్టీఆర్ కు చరణ్ కంగ్రాట్స్ చెప్పి, కాంప్లిమెంట్స్ ఇచ్చాడట.
‘నాన్నకు ప్రేమతో’లోని కొన్ని సన్నివేశాలు రామ్ చరణ్ చేయబోతున్న ‘తనీ ఒరువన్’ రీమేక్ లోని కొన్ని సీన్స్ తో క్లాష్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో చరణ్ ఆ సినిమా చూసినట్లు సమాచారం. అందులో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ నచ్చి అతడికి ఫోన్ చేసి అభినందించాడట చరణ్. ‘శ్రీమంతుడు’ సినిమా విషయంలో మహేష్ కు కూడా చరణ్ ఫోన్ చేసి అభినందించడం.. దాని గురించి మహేష్ ప్రత్యేకంగా ప్రస్తావించడం తెలిసిన సంగతే. మొత్తానికి ఇగోస్ ఏమీ పెట్టుకోకుండా చరణ్ ఇలా తోటి స్టార్ హీరోల్ని అభినందించడం మంచి పరిణామమే.