Begin typing your search above and press return to search.
వెన్న చిలికిన రామ్ చరణ్ - కృష్ణుడంటూ ముద్దు చేసిన నాన్నమ్మ
By: Tupaki Desk | 1 May 2020 3:20 PM ISTప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలు షూటింగులు లేకపోవడంతో కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. కొందరు వర్క్ అవుట్స్ లో బిజీగా ఉంటే మరి కొందరు వంట గదిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా హీరో రామ్‌చరణ్ కూడా కిచెన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తల్లి, నాన్నమ్మ నుంచి వెన్న తీయడం నేర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్‌చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ తన తల్లి సురేఖ - నాన్నమ్మ అంజనాదేవి పర్యవేక్షణ లో వెన్న తీయడం పూర్తి చేశాడు. మనవడిని ముద్దుగా కృష్ణుడంటూ గారం చేసింది నాన్నమ్మ. గతంలో అయితే పెరుగు నుండి వెన్న తీయడానికి కవ్వం ఉపయోగించే వాళ్ళు. కానీ కాలం మారే కొద్దీ ఎలక్ట్రిక్ వీల్ తో తీస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ఎలక్ట్రిక్ మిషన్ తో వెన్న తీయడం నేర్చుకున్నాడు.
'తాజా వెన్నను తయారు చేయడం నేర్చుకుంటున్నా' అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక రామ్ చరణ్ ని నాన్నమ్మ కృష్ణుడిలా ఉన్నావని కామెంట్ చేయడం వీడియోలో హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే రామ్ చరణ్ ఇంట్లోనే ఉంటూ భార్య ఉపాసనకు కాఫీ చేయడంతో పాటు వంట వండి పెట్టాడు. అంతకు ముందు ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేసేందుకు ప్రారంభించిన ‘బీ ది రియల్ మేన్ ఛాలెంజ్’ ను స్వీకరించి ఇంట్లో పనులు చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఆర్ ఆర్ ఆర్(రౌద్రం రణం రుధిరం)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'అల్లూరి సీతారామరాజు'గా రామ్ చరణ్ - కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాటు చరణ్ తన హోమ్ ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న 'ఆచార్య'లో కీలక పాత్ర పోషించబోతున్నాడు.
వీడియో కోసం క్లిక్ చేయండి