Begin typing your search above and press return to search.

రామ్ చరణ్‌ బర్త్ డే ఎందుకింత హడావుడి?

By:  Tupaki Desk   |   15 March 2020 11:20 AM GMT
రామ్ చరణ్‌ బర్త్ డే ఎందుకింత హడావుడి?
X
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు అభిమానులు చేసే హంగామా గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఫ్యాన్స్ స్వ‌యంగా కల్చరల్‌ ఈవెంట్స్ నిర్వహించడం.. అందులో మెగా హీరోలు పాల్గోంటూ చిరంజీవితో అనుబంధాన్ని.. ఆయన లెగసీని చర్చించడమనే ఆన‌వాయితీ చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి చిరు తనయుడు.. మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ పుట్టిన రోజుని భారీగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 27న రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈసారి స‌న్నివేశం వేరే లెవ‌ల్లో ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. స‌హ‌జంగా చ‌ర‌ణ్ బర్త్ డేల‌కు పెద్దగా హడావుడి ఉండదు. కుటుంబ సభ్యులు.. కొంత మంది అభిమానుల మధ్య జరుగుతుంటుంది. వివిధ ప్రాంతాల్లోని అభిమానులు ప్రైవేట్ గా బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటారు. కానీ ఈ సారి చెర్రీ బర్త్ డేకి ఫ్యాన్స్ చాలా హంగామా చేస్తున్నారని తెలుస్తోంది.

మునుప‌టితో పోలిస్తే .. ఈసారి ఏకంగా పదిహేను రోజుల ముందు నుంచే ఈ హంగామా ప్రారంభించారు. ఈ హ‌డావుడి చూస్తుంటే చిరు వేడుక‌ల్ని మించిపోయేలా అభిమానులు ప్లాన్ చేశార‌ట‌. మరి ఎందుకింత హడావుడి అనేది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. చెర్రీ బర్త్ డేని పురస్కరించుకుని ఆయనపై ఓ స్పెషల్‌ వీడియోని రూపొందిస్తున్నారు. రాష్ట్ర చిరంజీవి యువ‌త జ‌న‌రల్ సెక్ర‌ట‌రీ.. వెంక‌టాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ శివ చెర్రీ ఇన్ ఫినిటమ్‌ మీడియాతో క‌లిసి చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ స్పెష‌ల్ సాంగ్ ను రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ‘రామ్‌ కొ.ణి.దె.ల’ అంటూ సాగే ఈ బ‌ర్త్‌డే స్పెష‌ల్ సాంగ్ ని స్కార్పియ‌న్ ఆల‌పించారు. పూర్తి పాటను మార్చి 24 సాయంత్రం 4 గంటలకు విడుద‌ల చేయ‌నున్నట్టు తెలిపారు. తాజా ప్రొమోలో చరణ్‌ మొదటి సినిమా `చిరుత‌` నుంచి `వినయ విధేయ రామ` వరకు ఆయన గెటప్ లు.. ఆయా చిత్రాల్లోని హైలైట్‌ సన్నివేశాలను ప్ర‌త్యేకంగా మిక్స్ చేసిన వీడియో రూపొందించారు.

మరోవైపు చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారు. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా.. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌... తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్‌.. ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇక చ‌ర‌ణ్ బ‌ర్త్ డే వేడుక‌ల్ని అంత గ్రాండ్ గా జ‌ర‌ప‌డం వెన‌క ఆర్.ఆర్.ఆర్ స్టార్ గా అత‌డి క్రేజును పాన్ ఇండియా లెవ‌ల్లో పెంచేందుకేనా? అన్న కామెంట్లు ఓ వైపు వినిపిస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి