Begin typing your search above and press return to search.

పేరంటాలపల్లిలో చెర్రీ-ఉపాసన

By:  Tupaki Desk   |   23 April 2017 10:03 AM IST
పేరంటాలపల్లిలో చెర్రీ-ఉపాసన
X
రామ్ చరణ్ భార్య ఉపాసన ఇప్పుడు గోదావరి జిల్లాల్లో భర్తతో కలిసి టూర్ లో ఉందనే విషయం తెలిసిందే. ఇటు సుకుమార్ తో సినిమా షూటింగ్ చేస్తూనే.. మరోవైపు భార్యతో కలిసి గోదారి జిల్లాల అందాలన్నీ చూసేస్తున్నాడు మెగా పవర్ స్టార్. తాజాగా ఈ దంపతులు ఇద్దరూ కలిసి పాపికొండలు యాత్ర చేశారు. ఈ ట్రిప్ కి సంబంధించిన డీటైల్స్ ను తనే వెల్లడించింది చెర్రీ వైఫ్.

'పాపికొండలు ప్రాంతంలో పేరంటాలపల్లి గ్రామంలో ఉన్నాం. మొత్తం గ్రామం అంతా ఎంతో సాదరంగా మాకు ఆహ్వానం పలికింది. మమ్మల్ని స్వాగతించడంమే కాదు.. వారికి ఆత్మ గౌరవం.. తమ గ్రామంపై ఎంతో గౌరవం ఉన్నాయి. కొంచెంలో ఉన్న ఆనందం వారిలో కనిపిస్తోంది. వీరి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అంతే కాదు.. మిస్టర్ సి పర్సనల్ టూర్ గైడ్ కూడా ఈ ఫోటోలో ఉన్నాడు' అని చెబుతూ పేరంటాల పల్లి గ్రామస్తులతో దిగిన ఫోటోను షేర్ చేసింది ఉపాసన.

పలువురు గ్రామస్తుల మధ్యలో చెర్రీ అండ్ వైఫ్ కూర్చుని దిగిన ఈ ఫోటో భలే చూడముచ్చటగా ఉండగా.. రామ్ చరణ్ ఎప్పటిలాగానే ఓ బుడతడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దులాడేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/