Begin typing your search above and press return to search.
శతచండీ యాగంలో రామ్ చరణ్-ఉపాసన
By: Tupaki Desk | 11 Dec 2015 10:39 AM ISTటాలీవుడ్ లో స్టార్ హీరోగా తన హవా సాగిస్తున్నాడు రామ్ చరణ్. జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ డమ్ ని కొనసాగించే సత్తా ఉన్న హీరోగా వెలుగులు విరజిమ్ముతున్నాడు. కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని విస్తరించాడు. బ్రూస్ లీ తర్వాత ఏ సినిమాలో నటించాలి? అన్న విషయంలో కాస్త తర్జనభర్జన పడిన తర్వాత చివరికి తని ఒరువన్ రీమేక్ కే ఫిక్సయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాకి ప్రస్తుతం సన్నాహాలు సాగుతున్నాయి.
అయితే ఇంతలోనే ఈ తీరిక సమయాన్ని ఫ్యామిలీ కోసం కేటాయించి, పూజలు పునస్కారాలతో పునీతం అవుతున్నాడు చరణ్. ఇటీవలే దోమకోటలో కొన్ని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. భార్య ఉపాసన సహా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కార్తీక మాసం వేళ ఉపాసన ఫ్యామిలీ ప్రతియేటా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. కామినేని వంశానికి ఇదో ఆనవాయితీ.. కార్తీక మాసం పురస్కరించుకుని దంపతులిద్దరూ పూర్ణాహుతి పూజలో పాల్గొన్నారు. అంతేకాదు అక్కడ శతచండీ యాగం కూడా చేస్తున్నారు.
అయితే దోమకొండలో రామ్ చరణ్ అడుగుపెట్టాడు అని తెలుసుకున్న అభిమాన జనం అక్కడ ఎగబడ్డారు. చరణ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో చెర్రీ తన అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఖుషీ చేసేశారు.