Begin typing your search above and press return to search.

ఆ లొకేషన్ లో చెర్రీనే లాస్ట్

By:  Tupaki Desk   |   29 March 2017 5:41 AM GMT
ఆ లొకేషన్ లో చెర్రీనే లాస్ట్
X
రామ్ చరణ్ తో తీస్తున్న మూవీకి.. లొకేషన్స్ విషయంలో ఇప్పటికి ఓ క్లారిటీ వచ్చింది. తూగో.. పగో జిల్లాలను తిరిగేసిన సుకుమార్ అండ్ టీం.. ఎట్టకేలకు పోలవరం సమీపంలో పూడిపల్లి గ్రామంతో పాటు.. మరి కొన్ని లొకేషన్స్ ను ఫైనల్ చేశారు.

ఏప్రిల్ 1 నుంచి మొదలుపెట్టి తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో షెడ్యూల్ ను కూడా పోలవరం.. పూడిపల్లి.. పరిసరాల్లోనే చిత్రీకరించనున్నారు. ఈ లొకేషన్ తో టాలీవుడ్ కి బోలెడంత రిలేషన్ ఉంది. రెండున్నర దశాబ్దాలకు పూర్వం బాలయ్య నటించిన బంగారుబుల్లోడు ఇక్కడే తీశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో పాపిం కొండలు.. పోలవరం కనిపిస్తాయి కానీ.. కాసింత డ్యురేషన్ తక్కువ అంతే. కానీ చెర్రీ మూవీ మాత్రం దాదాపుగా సినిమా అంతా ఇక్కడే షూటింగ్ చేయనున్నారు. అయితే.. ఈ లొకేషన్ లో ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకునే చివరి భారీ చిత్రం సుక్కు-చెర్రీలదే కావచ్చు.

ఎందుకంటే.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోతే.. ఇక్కడ షూటింగ్ లకు ఈ గ్రామాలు ఉండకపోవచ్చు. ఆ అద్భుతమైన అందాలను కెమేరాలో బంధించి సినిమాలో చూపడం ఇకపై సాధ్యం కాకపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/