Begin typing your search above and press return to search.

సమంతకి పడలేదు.. ప్యాకప్??

By:  Tupaki Desk   |   24 April 2017 11:56 PM IST
సమంతకి పడలేదు.. ప్యాకప్??
X
సుకుమార్ డైరక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా గోదావరి పరిసరాలలో షూటింగ్ జరుపుకుంటోంది. అది మనకు తెలిసిందే. సినిమా షూటింగ్ అనుకున్న డేట్స్ లో పూర్తి చేయడానికి టీమ్ అంతా సమిష్టిగా బాగానే కష్టపడుతున్నారు.

అయితే రామ్ చరణ్ కొన్ని వారాలుగా అక్కడే ఉంటున్నాడు కూడాను. మండే ఎండల్లో మూడు వారాలుగా షూటింగ్ చేస్తున్నారు. హీరోయిన్ సమంత తో లేని సీన్ లు ముందుగా షూటింగ్ మొదలిపెట్టారు. ఆ షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ షెడ్యూల్‌ ప్రకారం కొద్ది రోజుల ముందు రామ్ చరణ్ తో సమంతతో జతగా ఉన్న సీన్ల షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసుగా.. సమంతకు అక్కడ మండే ఎండలుకు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయిందట.

అసలు గోదావరిలో షూటింగ్ సమంత సీన్ లు తో అక్కడ పూర్తివుతుంది కానీ.. సమంత వడదెబ్బతో షూటింగ్ ఆపివేయవలిసి వచ్చింది. ఆమె ఈరోజుకు సర్ధుకొంటుంది అని అనుకున్నారు అంతా కానీ అలా జరగలేదట. దానితో ఇంకా అక్కడ షూటింగ్ కి పేకప్ చెప్పేశారని టాక్. మరి రెండో షెడ్యూల్‌ మే మాసం లో ఉంది.. అప్పుడు సూర్యడు ప్రతాపం పరకాస్టా గా ఉంటుంది.. అప్పుడు ఎలా చేస్తారో ఏంటో. .పాపం ఎండలు కు తట్టుకో లేక ఎన్ని అవస్థలు పడుతున్నారో కదా.