Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌-కొర‌టాల సినిమా ఉంది

By:  Tupaki Desk   |   2 Feb 2016 1:00 AM IST
చ‌ర‌ణ్‌-కొర‌టాల సినిమా ఉంది
X
‘బ్రూస్ లీ’ వ‌చ్చి మూడు నెల‌లు దాటుతోంది. ఇంకా త‌న త‌ర్వాతి సినిమాను మొద‌లుపెట్ట‌లేదు రామ్ చ‌ర‌ణ్‌. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సిన ‘త‌నీ ఒరువ‌న్ రీమేక్ మొద‌ల‌వ‌డానికి ఇంకా కొన్ని రోజులు ప‌ట్టేలా కనిపిస్తోంది. ఐతే ఇంత‌లోనే అత‌డి త‌ర్వాతి సినిమాల‌పై రోజుకో కొత్త క‌బురు వినిపిస్తోంది. ఇప్ప‌టికే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ హీరోగా ఓ సినిమాకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై స్వ‌యంగా సుకుమారే క్లారిటీ ఇచ్చాడు కూడా. మ‌రోవైపు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి కూడా చ‌ర‌ణ్ ఆస‌క్తి చూపుతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. అది ప్ర‌స్తుతానికి హోల్డ్ లో ఉంది.

ఐతే తాజాగా చ‌ర‌ణ్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల్లో ఇంకో ఆస‌క్తిక‌ర సినిమా వ‌చ్చి చేరింది. మిర్చి - శ్రీమంతుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో జోరుమీదున్న కొర‌టాల శివ‌తో చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్రాజెక్టు గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌ముఖ పీఆర్వో - నిర్మాత బి.ఎ.రాజు వెల్ల‌డించారు. ఆయ‌న చెప్పారంటే ఇది క్రెడిబుల్ న్యూసే అయి ఉంటుంది. బ‌హుశా ఎన్టీఆర్ తో ‘జ‌న‌తా గ్యారేజ్’ త‌ర్వాత కొర‌టాల చేయ‌బోయే సినిమా ఇదే కావ‌చ్చు. విశేషం ఏంటంటే.. ‘మిర్చి’ త‌ర్వాత త‌న రెండో సినిమానే కొర‌టాల చ‌ర‌ణ్ తో చేయాల్సింది. బండ్ల గ‌ణేష్ నిర్మాణంలో ఆ సినిమాకు కొబ్బ‌రికాయ కూడా కొట్టారు. కానీ అనివార్య కార‌ణాల‌తో ఆ సినిమా ఆగిపోయింది. ఆ త‌ర్వాత శ్రీమంతుడు మొదలుపెట్టాడు కొర‌టాల‌. అప్పుడేం జ‌రిగిందో కానీ.. చ‌ర‌ణ్‌-కొర‌టాల కాంబినేష‌న్ మ‌ళ్లీ ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది.