Begin typing your search above and press return to search.
కొరటాలతో చెర్రీ.. ఖాయమైందోచ్
By: Tupaki Desk | 11 July 2017 12:37 PM ISTరామ్ చరణ్ ఇప్పుడు సూపర్ స్పీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ధృవ మూవీతో పెర్ఫామెన్స్ లోనూ తాను ఎంతగా రాటుదేలాడో ప్రూవ్ చేసిన చెర్రీ.. కొత్త ప్రాజెక్టుల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ధృవ సక్సెస్ తర్వాత సుకుమార్ తో సినిమా ప్రారంభించాడు చెర్రీ. సుక్కు మూవీ తర్వాత మణిరత్నంతో మూవీ ఉంటుందని అంతా భావించారు.
కానీ చెలియా డిజాస్టర్ కారణంగా ఈ లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు కొరటాల శివతో రామ్ చరణ్ మూవీ ఖాయం అయింది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఊపు మీద ఉన్న కొరటాలతో రామ్ చరణ్ మూవీ అనగానే క్రేజ్ పెరిగిపోయింది. నిజానికి చెర్రీ-కొరటాల కాంబినేషన్ లో గతంలోనే ఓ సినిమా ప్రారంభం అయి.. పూజా కార్యక్రమాల తర్వాత ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మూవీని తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు.. మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ తో కలిసి నిర్మించనున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
క్రేజీ డైరెక్టర్ తో చెర్రీ నెక్ట్స్ మూవీ అనే సరికి ఈ కాంబోపై మెగా ఫ్యాన్స్ లో అంచనాలు ఎక్కువైపోతున్నాయి. అయితే.. ఇప్పుడు కొరటాల కొత్త కథతో చెర్రీని ఒప్పించాడా.. గతంలో చెప్పిన స్టోరీకే కట్టుబడి ఉన్నాడా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.