Begin typing your search above and press return to search.
ఏంటి ఈ కరోనా ప్రోగ్రాం రాజమౌళి ప్లానా..!
By: Tupaki Desk | 17 March 2020 12:45 PM ISTప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి మన దేశంలో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంది. ఈ అవగాహన కార్యక్రమాలను సెలెబ్రిటీలు కూడా నిర్వహించడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే కొందరు మాత్రం ఇలాంటి ప్రోగ్రాంలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తను రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్ర ప్రమోషన్లలో భాగంగా కరోనా పై స్పందించినట్లు సినీ ఇండస్ట్రీ కోడై కూస్తుంది.
రీసెంట్ గా హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు ఒక చిన్న వీడియో రూపంలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు. ఆ వీడియోలో కరోనా రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆరు ఆరోగ్య సూత్రాలుగా వివరించారు. ఇదిలా ఉండగా డైరెక్టర్ రాజమౌళినే వాళ్ళిద్దరితో కరోనా అవెర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి సినిమా ప్రమోషన్లను ప్రారంభించాడని సోషల్ మీడియా అంతా మాట్లాడుకుంటున్నారు.
అంతగా కరోనా పై అవగాహన కల్పించాలి అన్పిస్తే ఇద్దరు హీరోలు విడివిడిగా వీడియోలను పోస్ట్ చేయొచ్చు కదా.. ఓహో ఇద్దరు కలిసి ప్రమోట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని వారి ఆలోచన అని విమర్శకులు భావిస్తున్నారు. కానీ కొందరు మాత్రం వారి ప్రయత్నానికి ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా రాజమౌళి మాత్రం పక్కా ప్లాన్ తో సినిమా ప్రమోషన్లలో భాగంగానే రాంచరణ్, ఎన్టీఆర్ లతో ఇలా చేయించాడని పబ్లిక్ టాక్. మరి దీనిపై ఆర్ఆర్ఆర్ టీం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.