Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ రికార్డులు అలా ప్ల‌స్

By:  Tupaki Desk   |   15 Oct 2018 6:02 AM GMT
చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ రికార్డులు అలా ప్ల‌స్
X
ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ స్నేహం ఆల్వేస్ హాట్ టాపిక్. తార‌క్‌ తో కెరీర్ తొలి నాళ్ల నుంచి స్నేహంగానే ఉంటున్నారు చ‌ర‌ణ్‌. ఈ మెగా హీరో అంటే నంద‌మూరి హీరోకి అంతే అభిమానం. ఆ ఇద్ద‌రూ క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ క్ర‌మంలోనే తార‌క్ నటించిన `అర‌వింద స‌మేత‌- వీర రాఘ‌వ‌` రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా కేవ‌లం మూడు రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్‌లో చేరి స‌త్తా చాటింది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా పై ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు.

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ జోడీ పై కాంప్లిమెంట్లు వెల్లువ‌లా ప్ర‌వ‌హిస్తున్నాయి. తాజాగా రామ్ చ‌ర‌ణ్ వంతు. ``తన కెరీర్‌లో మరోసారి యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో అలరించారు. బోల్డ్ స్టోరీ - సూపర్బ్ డైరెక్షన్ మరియు మంచి డైలాగులతో త్రివిక్రమ్ ఆకట్టుకున్నారు. జగపతిబాబు నటన, థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి పిల్లర్స్‌ గా నిలిచాయి. పూజా హెగ్డే నటనను బాగా ఎంజాయ్ చేశాను. అరవింద సమేత టీమ్‌కు నా అభినందనలు`` అంటూ ప్ర‌శంసించారు.

మొత్తానికి `రంగ‌స్థ‌లం` చిత్రంతో రామ్‌చ‌ర‌ణ్‌, `అర‌వింద స‌మేత‌` చిత్రంతో ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ చేశారు. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఆ ఇద్ద‌రూ రికార్డుల వేట సాగించారు. ఇద్ద‌రు రికార్డ్ బ్రేకింగ్ హీరోల‌తో రాజ‌మౌళి మ‌రిన్ని సంచ‌ల‌నాల‌కు తెర‌తీయ‌బోతున్నాడు అని అర్థ‌మ‌వుతోంది. ఆర్ఆర్ఆర్ మ‌ల్టీస్టార‌ర్‌కి అన్నీ పాజిటివ్ సంకేతాలే. ఇంత పాజిటివిటీ మ‌ధ్య ఈ మ‌ల్టీస్టార‌ర్ రిలీజ్ ముందే భారీ బిజినెస్ సాగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.