Begin typing your search above and press return to search.

మెగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   21 Feb 2016 9:30 AM GMT
మెగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు
X
మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా కోసం మెగాఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కొత్త మూవీ తని ఒరువన్ రీమేక్ కూడా రీసెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. చిరుతో పాటు చెర్రీ కూడా మరో రెండు నెలల పాటు షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదన్నది లేటెస్ట్ టాక్. ఇద్దరూ లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లి పనులతో మెగాస్టార్ ఇల్లు మహా బిజీగా ఉంది. కూతురు పెళ్లి కోసం చిరంజీవి, చెల్లి మ్యారేజ్ కారణంగా చరణ్.. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే చిరు సినిమా ఇంకా ప్రారంభం కాకపోయినా.. చరణ్ సినిమా మాత్రం అధికారికంగా మొదలైంది. ఈ నెలాఖర్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. చెర్రీ మినహా మిగిలిన సీన్స్ వరకూ కంప్లీట్ చేసే యోచనలో యూనిట్ ఉందని తెలుస్తోంది.

ఇక చిరు మూవీ కత్తి రీమేక్ అయితే ప్రస్తుతం స్టోరీ రైట్స్ ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలోగా నిర్మాతలు ఈ వివాదాన్ని సెటిల్ చేసుకోవచ్చని అంటున్నారు. ఈ లెక్కన మెగా తండ్రీ కొడుకులిద్దరూ.. తమ సినిమా షూటింగులను ఏప్రిల్ లో ఒకేసారి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆగస్ట్ 12న తని ఒరువన్ రీమేక్ ధృవకి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేయడంతో.. మరి ఈ టార్గెట్ అందుకోవడం తాజా పరిణామాల కారణంగా కష్టమే అంటున్నారు.