Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ స్పీడ్ పెంచాడు
By: Tupaki Desk | 31 Dec 2017 2:53 PM ISTఇంకా రంగస్థలం షూటింగ్ పూర్తి కానే లేదు. మరో షెడ్యూల్ దాక షూటింగ్ బాలన్స్ ఉందని యూనిట్ నుంచి సమాచారం. దీనికి సంబంధించిన అప్ డేట్స్ ముందు నుంచి సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ అయితే ఫాన్స్ లో ఇప్పటికీ ఉంది. మార్చ్ 30 సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానం కూడా కొందరిలో ఉంది. సుక్కు మాత్రం వచ్చే తీరుతుంది అని హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కొబ్బరి కాయ కొట్టుకుని షూటింగ్ మొదలు పెట్టుకున్న బోయపాటి శీను-రామ్ చరణ్ సినిమా షూటింగ్ జనవరి మూడో వారంలో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిసింది. జనవరి 18 లేదా 19 అని మెగా కాంపౌండ్ టాక్. మాస్ మసాలా సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన బోయపాటి, కథ ఎంత రొటీన్ గా ఉన్నా మాస్ సినిమాతో ఈజీగా 40 కోట్లు దాటించే చరణ్ కలిస్తే పండగే అని ఫాన్స్ ఇప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇందులో చరణ్ రెండు షేడ్స్ ఉండే పాత్రలో కనిపిస్తాడు అనే టాక్ కూడా బలంగా ఉంది. రాజస్తాన్ పరిసరాల్లో అధిక శాతం షూటింగ్ చేయబోతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రేమ్ రతన్ ధన పాయో జరిగిన లోకేషన్స్ ఇందు కోసం ప్రత్యేకంగా సెలెక్ట్ చేసినట్టు తెలిసింది. రాజవంశీకుడిగా రామ్ చరణ్ కనిపిస్తాడట. చిరంజీవి గతంలో రాజా విక్రమార్క - శివుడు శివుడు శివుడు లాంటి సినిమాల్లో ఈ తరహా పాత్ర పోషించారు. హీరొయిన్ గా కైరా దత్ - అను ఇమ్మానియేల్ - రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ఫస్ట్ పేరుకే హీరోతో సహా అందరు ఓటేసరట. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. డివివి దానయ్య నిర్మాత. షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి నవంబర్ లేదా డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేసేలా ప్రణాళిక వేస్తున్నారు.