Begin typing your search above and press return to search.

#నిహారిక పెళ్లి.. చ‌ర‌ణ్ - బ‌న్ని టోట‌ల్ ఫ్యామిలీతో దిగిపోయారు

By:  Tupaki Desk   |   7 Dec 2020 10:48 AM GMT
#నిహారిక పెళ్లి.. చ‌ర‌ణ్ - బ‌న్ని టోట‌ల్ ఫ్యామిలీతో దిగిపోయారు
X
కుంద‌న‌పు బొమ్మ నిహారిక కొణిదెల వివామం చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో జ‌ర‌గ‌నుంది. ఈ డిసెంబ‌ర్ 9న ఉద‌య్ పూర్ లోని ఉద‌య్ ప్యాలెస్ లో ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. రెండు రోజుల పాటు అత్యంత వైభ‌వంగా సాగే ఈ పెళ్లి కోసం ఇప్ప‌టికే వ‌ధూవ‌రులు ఇరు కుటుంబాల‌తో వెన్యూ వ‌ద్ద‌కు వ‌చ్చేవారు. నేటి ఉద‌యం చార్టెర్డ్ ఫ్లైట్ లో హైద‌రాబాద్ నుంచి ప‌య‌న‌మైన‌ప్ప‌టి ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.

ఈరోజు సాయంత్రానికి అతిథులంతా రాజ‌స్థాన్ లోని వెన్యూ వ‌ద్ద‌కు విచ్చేస్తార‌ని స‌మాచారం. వీరికోసం ప్ర‌త్యేకించి ఆ విలాస‌వంత‌మైన భ‌వంతిలో ఖ‌రీదైన సౌక‌ర్యాల‌తో గ‌దుల‌న్నీ శానిటైజేష‌న్ తో సిద్ధంగా ఉన్నాయిట‌.

ఇక రెండ్రోజుల ముందే అంటే సోమ‌వారం సాయంత్రానికే మెగాస్టార్ చిరంజీవి .. రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న దంప‌తులు.. వీరితో పాటే అల్లు అర్జున్ - స్నేహ కిడ్స్ తో దిగిపోయారు. అలాగే అల్లు అర‌వింద్ దంప‌తులు ఇక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. వీరంతా విమాన‌యానం చేసి వెళుతున్న‌ప్ప‌టి ఫోటోలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. మెగా కుటుంబం నుంచి నిహారిక సిస్ట‌ర్స్ .. అలాగే ఇత‌ర మెగా హీరోలు ప్ర‌యాణం గురించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.