Begin typing your search above and press return to search.
రామ్ చరణ్.. అలియా రొమాన్స్.. సెట్ చూస్తేనే ప్రేమ పుట్టేస్తుంది!
By: Tupaki Desk | 9 March 2021 8:00 AM IST'ఆచార్య' సినిమాలో టాకీ పార్ట్ ఫినిష్ చేసిన రామ్ చరణ్.. తిరిగి RRR సెట్స్ లో అడుగు పెట్టాడు. దీంతో.. తరువాయి కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తున్నాడు జక్కన్న. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఇన్నాళ్లూ మంటలు పుట్టించిన RRR సెట్స్ లో ప్రేమ జల్లు కురియనుంది. అవును.. ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు రాజమౌళి.
రామ్ చరణ్ - అలియా భట్ నడుమ అద్భుతమైన యుగళ గీతాన్ని తెరకెక్కించబోతున్నాడు. వాస్తవానికి ఈ సాంగ్ ఎప్పుడో షూట్ చేయాల్సింది. కానీ.. ఆచార్య సినిమాలో చెర్రీ రోల్ పెంచడంతో.. అనివార్యంగా RRR డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే.. షూటింగ్ మధ్యలో ముంబై వెళ్లిపోయింది అలియా. ఇప్పుడు చెర్రీ తిరిగి రావడంతో.. అలియా కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతోంది.
ఇక, రెగ్యులర్ సినిమాల్లో పాట అంటే ఎలా షూట్ చేసినా.. నడిచిపోతుంది. కానీ.. స్వాతంత్రానికి పూర్వం నాటి కథ కాబట్టి.. అప్పటి లొకేషన్ అనివార్యం. అందుకే.. రాజమౌళి బాహుబలి ఫేమ్ సాబు సిరిల్ రంగంలోకి దిగి అద్భుతమైన సెట్ ను రూపొందించాడట. హైదరాబాద్ శివార్లలో 1920 నాటి పరిస్థితులను తలపించేలా అందమైన సెట్ ను నిర్మించాడట. ఈ వీకెండ్ లో షూట్ చేయబోతున్నట్టు సమాచారం.దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే దసరా సందర్భంగా అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.