Begin typing your search above and press return to search.
151-152 రెడీనే... 150 మాత్రమే !!!!
By: Tupaki Desk | 14 Oct 2015 10:31 AM ISTఎన్ని విధాలుగా కన్విన్స్ చేద్దామని చూసినా బ్రూస్ లీ సినిమాలో చిరు పాత్ర ఆయనకు 150వ సినిమా అని చరణ్ అంగీకరించడంలేదు. నాన్నగారి 150వ సినిమాకి ఏడాది ముందే విడుదల చేస్తున్న టీజర్ లాంటిదని చెప్పుకొచ్చాడు. ఎప్పటికీ నాన్నగారి వెనుకే వుండడానికి ఇష్టపడతానని మరోసారి స్పష్టం చేసాడు.
దసరా లోపు చిరు తదుపరి సినిమాని ప్రకటిస్తామని, దీనికోసం కొణెదల ప్రొడక్షన్స్ స్తాపిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 'కత్తి' రీమేక్ చేసే యోచనలో వున్నా ఆ విషయాన్ని వందశాతం ధ్రువీకరించలేదు. చిరు 150వ సినిమాకి మాత్రమే ఇంత తర్జన భర్జన పడుతున్నారట. ఆ తరువాత రాబోయే 151-152 సినిమాలకు కధలు, దర్శకులు ఇప్పటికే సిద్ధమయ్యారని తెలిపాడు.
బ్రూస్ లీలో చరణ్, చిరు వేర్వేరు గుర్రాలపై స్వారీ చేస్తూ కనిపిస్తారట. ఆ సీన్ సినిమాని మరో ఎత్తుకి తీసుకెళ్తుందని చరణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదలకానున్న సంగతి తెలిసినదే.