Begin typing your search above and press return to search.

అబ్బాయ్ చరణ్ దగ్గర అప్పు చేసిన బాబాయ్ పవన్...!

By:  Tupaki Desk   |   14 May 2020 4:20 PM IST
అబ్బాయ్ చరణ్ దగ్గర అప్పు చేసిన బాబాయ్ పవన్...!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పు చేసాడు. అదేంటి.. బాబాయ్ పవన్ కళ్యాణ్ అబ్బాయ్ చరణ్ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా.. అవునండీ మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించాడు. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ 'చిరుత' సినిమాతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. చరణ్ లాంచింగ్ అప్పట్లో గ్రాండ్ గా జరిగింది. సౌత్ సినీ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీ సినీ ప్రముఖులు కూడా చరణ్ 'చిరుత'ని ప్రమోట్ చేసారు. అందరూ ఊహించినట్లే చిరు తనయుడు చిరుత అనిపించుకున్నాడు. దీనికి బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా తన వంతుగా చరణ్ కోసం పలు కార్యక్రమాలకి అటెండ్ అయ్యాడు. 'చిరుత' సినిమా ప్రమోషన్స్ కోసం చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్న అభిమానులు ఈ ఇంటర్వ్యూని బయటకి తీశారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగే ప్రశ్నలకు ముగ్గురు సమాధానం ఇస్తూ వచ్చారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ చరణ్ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకునేవాడని గుర్తు చేసాడు.

పవన్ కళ్యాణ్ నవ్వుతూ.. చరణ్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి మొహమాటం కానీ సిగ్గు కానీ లేవని.. డబ్బులు అవసరమైతే ఎవరి దగ్గరైనా తీసుకుంటానని చెప్పాడు. దీనికి చిరు ''అయినా చిన్న పిల్లల దగ్గర డబ్బులు లాగేసుకోవడం ఏంటిరా'' అంటూ నవ్వుతూ ప్రశ్నించాడు. దానికి పవన్ సమాధానం ఇస్తూ.. ''అవసరాలకి పెద్దా.. మొదటి సినిమా అయిపోయిన తర్వాత చాలా రోజుల వరకు నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. వదినని అడిగితే హీరో అయ్యాడు ఇంకా డబ్బులు అడుగుతున్నాడు ఏంటా అని అనుకుంటుందేమో అని వదినని అడిగే వాడిని కాదు. అప్పుడప్పుడు హోటల్ కి వెళ్ళినప్పుడు బిల్ పే చేయగా మిగిలిన డబ్బులు అన్నయ్య ఉంచుకోమని చెప్పేవాడు. కానీ ఒక్కోసారి మాత్రం జేబులో ఐదు పది రూపాయలు కూడా ఉండేవి కాదు. అప్పుడు ఎలా వచ్చేవో తెలియదు కానీ వీడి (చరణ్) దగ్గర డబ్బులు ఉండేవి. నేను హీరోని కదా నెక్స్ట్ సినిమాలో నటించేప్పుడు నీకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానని మనీ తీసుకునే వాడిని. ఆల్మోస్ట్ ఖుషీ సినిమా దాకా ఆ డబ్బులు అడిగేవాడు. కానీ నేను ఇవ్వలేదు. ఇప్పుడు హీరో అయ్యాడు ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

దీనికి చరణ్ మాట్లాడుతూ.. నేను కూడా ఖర్చుపెట్టకుండా వడ్డీ వస్తుంది కదా అని డబ్బులు దాచిపెట్టి మరీ బాబాయ్ కి ఇచ్చే వాడినని.. అవి మళ్ళీ తిరిగి ఇచ్చేవాడు కాదని చెప్పాడు. చిరు కల్పించుకొని.. ఎప్పుడూ ఇలాంటి టాక్ షోస్ కి రాని కళ్యాణ్ ఇప్పుడు ఇలా చరణ్ కోసం ప్రోగ్రాం కి వచ్చాడు. అదే పదివేలు. అందుకు వీడే తిరిగి డబ్బులు ఇవ్వాలి అంటూ నవ్వేసాడు. 'చిరుత' సినిమా ప్రమోషన్స్ అప్పుడు జరిగిన ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటూ మెగా అభిమానులు ఈ వీడియోని వైరల్ చేసారు.