Begin typing your search above and press return to search.

చెర్రీ అప్పుడే మూడోది మొదలెట్టాడు

By:  Tupaki Desk   |   4 July 2016 11:26 PM IST
చెర్రీ అప్పుడే మూడోది మొదలెట్టాడు
X
రామ్ చరణ్ ఓ సినిమాని స్టార్ట్ చేయడంలో స్లోగా ఉంటాడేమో కానీ.. ఒకసారి మొదలుపెట్టాడంటే చకచకా ఫినిష్ చేయడంలో స్పెషలిస్ట్. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ. ఈ సినిమా షూటింగ్ లో చెర్రీ భాగం కాకుండానే ఓ షెడ్యూల్ పూర్తయిపోయిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే కశ్మీర్ వెళ్లి కీలక సన్నివేశాలతో పాటు పాటలను కూడా పిక్చరైజ్ చేసుకుని వచ్చేశాడు.

ఇప్పుడు హైద్రాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసేశారంటే.. ఏ స్పీడ్ లో ధృవ షూటింగ్ జరుగుతోందో అర్ధమవుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను జెట్ స్పీడ్ లో షూటింగ్ చేసేస్తున్న చరణ్.. రిలీజ్ పై కూడా ముందే టార్గెట్ సెట్ చేసుకున్నాడు. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేయాలన్నది నిర్మాత అల్లు అరవింద్ ఆలోచన. అయితే.. ఈ డేట్ మిస్ అయినా.. అక్టోబర్ 7న అయితే మాత్రం విడుదల ఖాయం అన్నది మేకర్స్ ఆలోచన.

తమిళ్ వెర్షన్ కి పెద్దగా మార్పులు చేయకపోయినా చెర్రీ ఇమేజ్ కి.. టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లుగా కొన్ని ట్రాక్స్ అదనంగా జోడించారని అంటున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ధృవను పిక్చరైజ్ చేస్తున్నాడు. కోలీవుడ్ సంచలన సంగీత ద్వయం హిప్ హాప్ తమీజాలు సంగీతం అందిస్తున్నారు.